iDreamPost

కార్తీక పౌర్ణమి రోజు తిరుమల శ్రీవారి సేవలో ప్రధాని మోదీ

  • Published Nov 27, 2023 | 10:21 AMUpdated Nov 27, 2023 | 10:21 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ వివరాలు..

  • Published Nov 27, 2023 | 10:21 AMUpdated Nov 27, 2023 | 10:21 AM
కార్తీక పౌర్ణమి రోజు తిరుమల శ్రీవారి సేవలో ప్రధాని మోదీ

కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాల వద్దరు చేరుకుని.. దీపాలు వెలిగిస్తూ.. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ కోరుకుంటున్నారు. ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. తిరులమ శ్రీవారిని దర్శించుకున్నారు. మోదీ రాక నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆలయ మహాద్వారం దగ్గరకు ఎదురెళ్లి.. ప్రధానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని.. అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నారు మోదీ. అనంతరం హుండీలో కానుకలు సమర్పించారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ప్రధాని మోదీకి అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. సుమారు 50 నిమిషాల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో గడిపారు మోదీ. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధాని తిరుమల నుంచి బయల్దేరి తెలంగాణకు చేరుకోనున్నారు. నేడు అనగా సోమవారం నాడు మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటారు.

తిరుమల పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ శనివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్‌ నజీర్, సీఎం వైఎస్‌ జగన్‌ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి ప్రధాని తిరుమలలోని రచనా గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. దర్శనం అనంతరం రచనా గెస్ట్‌‌హౌస్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని రేణిగుంట నుంచి తెలంగాణకు బయల్దేరారు. మోదీ తిరుమల పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ తుప్రాన్, నిర్మల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. క్రితం సారి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడ్డారని.. కేసీఆర్ కుటుంబంపై దర్యాప్తు జరుగుతోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి