iDreamPost

విదేశాల్లో పెళ్లిల్లా? సెలబ్రెటీలకు మోదీ స్వీట్ వార్నింగ్!

అంతేకాకుండా.. తన తాజా వ్యాఖ్యాలతో సెలబ్రిటీలు, సంపన్నులు, పారిశ్రామికవేత్తలకు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవటానికి వీల్లేని లక్ష్మణ రేఖను గీశారని చెప్పాలి.

అంతేకాకుండా.. తన తాజా వ్యాఖ్యాలతో సెలబ్రిటీలు, సంపన్నులు, పారిశ్రామికవేత్తలకు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవటానికి వీల్లేని లక్ష్మణ రేఖను గీశారని చెప్పాలి.

విదేశాల్లో పెళ్లిల్లా? సెలబ్రెటీలకు మోదీ స్వీట్ వార్నింగ్!

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. చాలా మంది ఉన్నత కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కవ ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఈ అంశం పై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జరిగిన “మన్ కీ బాత్” అనే కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన ఆ అంశం.. దేశంలోని బడా బాబులకు, పారిశ్రామికవేత్తలకు, స్టార్ సినీ సెలబ్రిటీలకు సైతం షాకిచ్చేలా ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ డెస్టినేషన్ మ్యారేజ్.

ఇందులో భాగంగా దేశంలోని అత్యంత ధనవంతులు,సెలబ్రిటీలు, ప్రముఖులు వంటివారు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవటం అనేది ఫ్యాషన్ గా మారింది. ఈ విధంగా విదేశాల్లో పెళ్లి వేడుకలు నిర్వహించుకునే తీరును ఆయన తప్పు పట్టారు. ఈ పెళ్లి వేడుకలు అనేవి విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే చేసుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ లో రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారుల అంచనా వేస్తున్నారని.. కనుక ఈ పెళ్లి షాపింగ్ లో భారత్ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

“చాలా కాలంగా పెళ్లి కోసం ఇతర దేశాలకు వెళ్లటం నన్ను ఎంతగానో కలవరపెడుతోంది. దీని గురించి నా దేశ ప్రజలతో కాకపోతే ఇంకెవరితో చర్చిస్తాను? విదేశాల్లో పెళ్లి చేసుకోవడం అవసరమా? ఒక్కసారి దాని గురించి మీరంతా ఆలోచించాలి. పేద కుటుంబాలు వారు తమ పిల్లలకు లోకల్ ఫర్ వోకల్ ప్రాధాన్యం గురించి చెబుతున్నారు. కానీ.. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే ఉన్నత కుటుంబాల వారంత దీని గురించి ఆలోచించాలి” అని ప్రశ్నిస్తూ, సూటిగా తగిలేలా.. చురకలు వేశారు.

అదే భారతదేశంలో వివాహ వేడుకలు చేసుకుంటే దేశ ప్రజల మధ్య చేసుకున్నట్లు ఉంటుందని అన్నారు. అలాగే.. మన దేశంలోని ప్రజలకు ఏదో రూపంలో ఉపాధి ఆవకాశాలు ఇచ్చినట్లు ఉంటుందని, దీనితో దేశంలోని సొమ్ము దేశంలోనే ఉంటుదని వివరించారు. ఈ క్రమంలో.. విదేశాల్లో కాకుండా భారత్ లో పెళ్లిళ్లు చేసుకోవటం వల్ల లోకల్ ఫర్ వోకల్ కు మద్దతు ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్లినట్లు అవుతుందని మోదీ తెలిపారు. ఆయన ప్రసంగించిన మాటాలకు అటూ మధ్యతరగతి వాళ్లకి నిరుపేదలకు ఎంతో ఆకర్షించాయి.

తన ఆవేదన తప్పనిసరిగా ఉన్నత కుటుంబాల వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టుు చెప్పారు. ప్రధాని మోదీ ఇంత వివరంగా విదేశాల్లో పెళ్లి చేసుకోవటంపై తనకున్న అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన తర్వాత.. ఏ ప్రముఖుడైనా విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకోవటానికి సాహసిస్తారా? అన్న దానిపై ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకోవటం తప్పు అన్న రీతిలో మోదీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలనను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి