iDreamPost

విద్యార్థినిని సకాలంలో ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చి.. మానవత్వం చాటుకున్న CI

హైదరాబాద్ లో ఓ సీఐ విద్యార్థిని పట్ల మానవత్వం చాటుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన ఆ విద్యార్థినిని సకాలంలో ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చి అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు.

హైదరాబాద్ లో ఓ సీఐ విద్యార్థిని పట్ల మానవత్వం చాటుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన ఆ విద్యార్థినిని సకాలంలో ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చి అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు.

విద్యార్థినిని సకాలంలో ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చి.. మానవత్వం చాటుకున్న CI

పోటీ పరీక్షలు, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వంటి వాటికి హాజరయ్యే వారు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తుంటారు. అయినప్పటికీ కొంతమంది పరీక్ష కేంద్రానికి లేట్ గా వచ్చి ఇబ్బందులు పడుతుంటారు. ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు అనుమతించకపోవడంతో పరీక్షరాయకుండానే వెనుతిరిగి వెళ్లిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే కొంతమందికి ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తి.. మరికొంతమంది ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ లు మర్చిపోయి పరీక్ష కేంద్రాలకు లేట్ గా వెళ్తుంటారు. ఇదే విధంగా హైదరాబాద్ నగరంలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని అడ్రస్ తెలియక వెళ్లాల్సిన పరీక్ష కేంద్రానికి కాకుండా వేరే సెంటర్ కు వెళ్లి అవస్థలు పడింది. ఆ సమయంలో ఆ విద్యార్థిని పరిస్థితిని గమనించిన సీఐ ఆమె పట్ల మానవత్వం చాటుకున్నారు.

పరీక్ష అంటేనే కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. అలాంటిది పరీక్ష సమయం దగ్గర పడుతున్నా ఇంకా ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోకపోతే ఆ ఒత్తిడి మరింత రెట్టింపవుతుంది. ఇదే విధమైన టెన్షన్ ను నల్లగొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన విద్యార్థిని వైష్ణవీ ఎదుర్కొన్నది. కానీ ఆమెకు నారాయణగూడ సీఐ చంద్రశేఖర్ సాయం అందించడంతో సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకుని పరీక్షరాసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థిని వైష్ణవీ టీఎస్ఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు హైదరాబాద్కు వచ్చింది. ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరింది. అయితే తాను ఎగ్జామ్ రాయాల్సిన సెంటర్ అంబర్పేట్లోని పటేల్ నగర్లో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్ అయితే.. ఆటోడ్రైవర్ తప్పిదంవల్ల నారాయణగూడలోని గురునానక్ హైస్కూల్కు చేరుకుంది.

అక్కడే ఉన్న సిబ్బంది వైష్ణవీ పరీక్షరాయాల్సిన సెంటర్ ఇది కాదని సూచించారు. అప్పటికే పరీక్ష సమయం ముంచుకొస్తుంది. తన పరీక్ష్ కేంద్రానిక ఎలా వెళ్లాలో తెలియక ఆ విద్యార్థిని ఆందోళన చెందింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న నారాయణగూడ సీఐ చంద్రశేఖర్ గమనించారు. విద్యార్థిని నుంచి వివరాలు తెలుసుకున్న సీఐ వెంటనే తన పెట్రోలింగ్ వాహనంలో విద్యార్థినిని ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లారు. పరీక్ష సమయం కంటే ముందుగానే చేర్చి విద్యార్థిని పరీక్షరాసేలా మానవత్వం చాటుకున్నారు. విద్యార్థిని వైష్ణవి భవిష్యత్తుకు ఉపయోగపడే పరీక్ష రాసేందుకు.. ఎగ్జామ్ సెంటర్ కు తరలించడంలో సహాయపడిన సీఐపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తన పట్ల మానవత్వం చాటుకున్న నారాయణగూడ సీఐ చంద్రశేఖర్ కు విద్యార్థిని వైష్ణవి ఫోన్చేసి కృతజ్ణతలు తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి