iDreamPost

మనవడిపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి ప్రేమ.. ఏకంగా రూ.240 కోట్లు!

  • Published Mar 19, 2024 | 9:54 PMUpdated Mar 19, 2024 | 9:54 PM

సాధారణంగా ఒక నాలుగు నెలల పసి పిల్లవాడికి ఎవరైనా ఆదుకునేందుకు బొమ్మలు, బట్టలు లేదా బంగారం ఇస్తూ ఉంటారు. కానీ, ఇక్కడ ఒక తాత మాత్రం కొన్ని కోట్లు విలువ చేసే షేర్స్ ను మనవడికి బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సాధారణంగా ఒక నాలుగు నెలల పసి పిల్లవాడికి ఎవరైనా ఆదుకునేందుకు బొమ్మలు, బట్టలు లేదా బంగారం ఇస్తూ ఉంటారు. కానీ, ఇక్కడ ఒక తాత మాత్రం కొన్ని కోట్లు విలువ చేసే షేర్స్ ను మనవడికి బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 19, 2024 | 9:54 PMUpdated Mar 19, 2024 | 9:54 PM
మనవడిపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి ప్రేమ.. ఏకంగా రూ.240 కోట్లు!

ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎంత గొప్ప హోదా, డబ్బు ఉన్న వాళ్ళైనా కానీ .. నాలుగు నెలల పసి పిల్లాడికి ఇచ్చే కానుకలు ఏమై ఉంటాయి.. బొమ్మలు, బట్టలు మహా అయితే బంగారం. కానీ, ఇక్కడ ఒక తాత తన మనవడికి ఇచ్చిన బహుమతి గురించి వింటే మాత్రం అందరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏకంగా ఆయన తన మనవడి కోసం కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే షేర్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత పేరొందిన వ్యక్తి . ఆయన సతీమణి కూడా అందరికి సుపరిచితురాలే.. ఆమాటకొస్తే ఆయన అల్లుడు ఏకంగా బ్రిటన్ నే పాలిస్తున్నాడు. ఇప్పటికే ఆయన ఎవరో అందరికి అర్ధమయ్యి ఉంటుంది. ఆయన మరెవరో కాదు.. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి.

నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతులకు .. అక్షతా మూర్తి, రోహన్ మూర్తి అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూతురు అక్షతా మూర్తికి, రిషి సునాక్ తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు. రిషి సునాక్ ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా తన భాద్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తికి అపర్ణ కృష్ణన్ తో వివాహం జరిగింది. వారికీ నాలుగు నెలల క్రితం ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి. ఈ బాబు పుట్టుకతోనే కోటీశ్వరుడు అయిపోయాడు. తాజాగా నారాయణ మూర్తి తన మనవడికి .. రూ.240 కోట్ల విలువైన 50 వేల మార్కెట్ షేర్స్ ను బహుమతిగా ఇచ్చారు. ఇది ఇన్ఫోసిస్ కంపెనీలో 0.04 శాతం వాటాగా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ షేర్స్ 0.40 శాతం నుంచి 0.36 శాతం వరకు పడిపోయాయి. ప్రస్తుతం కంపెనీలో హోల్డింగ్ వేల్యూ రూ.5,586.66 కోట్లుగా ఉంది.

Narayanamurthy

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తపై రకరకాల మీమ్స్, కామెంట్స్ వచ్చేస్తున్నాయి. అయితే, నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతులు తమ కెరీర్ ను కలిసి ఎలా బిల్డ్ చేసుకున్నారన్నది.. ఇప్పటికే ఎన్నో ఇంటర్వూస్ లో మనం చూశాము. ఎంతో మంది యంగ్ యచివర్స్ కు ఈ దంపతులిద్దరూ ఆదర్శంగా నిలుస్తారని చెప్పడంలో .. ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఇన్ఫోసిస్ కంపెనీ విషయానికొస్తే.. 1981 లో మొదలైన ఈ కంపెనీ ఈరోజు వరకు కూడా .. కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ కు ఉద్యోగాలను అందిస్తూ వస్తుంది. ఈరోజున ప్రముఖ టెక్ కంపెనీస్ అన్నటికి కూడా ఇన్ఫోసిస్ గట్టి పోటీని ఇస్తూ.. మంచి మార్కెట్ వేల్యూను కలిగి ఉంది. దీని అంతటికి కారణం కేవలం నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతులు మాత్రమే. మరి, నారాయణ మూర్తి తన మనవడికి కొన్ని కోట్లు విలువ చేసే షేర్స్ ను బహుమతిగా ఇవ్వడంపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి