iDreamPost

ఇన్ఫోసిస్ లో సైబర్ దాడుల కలకలం!

ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో సైబర్ సెక్యూరిటీ సమస్యలు కలకలం రేపుతున్నాయి. కంప్యూటర్లు, కొన్ని యాప్స్ పనితీరులో సమస్యలు తలెత్తాయి.

ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో సైబర్ సెక్యూరిటీ సమస్యలు కలకలం రేపుతున్నాయి. కంప్యూటర్లు, కొన్ని యాప్స్ పనితీరులో సమస్యలు తలెత్తాయి.

ఇన్ఫోసిస్ లో సైబర్ దాడుల కలకలం!

ప్రస్తుతకాలంలో సైబర్ దాడులు అనే పదాన్ని తరచుగా వింటున్నాం. ముఖ్యంగా ప్రముఖ టెక్ కంపెనీలపై సైబర్ దాడులు చేసి డేటా చోరీకి పాల్పడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కాన్ఫిడెన్షియల్, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చేజిక్కించుకునే ఆస్కారం ఉంటుంది. ఆ సమాచారంతో సైబర్ నేరాలకు పాల్పడవచ్చు. ఆ సమాచారాన్ని డార్క్ వెబ్ లో అమ్మకానికి కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీలో సైబర్ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ సైబర్ సెక్యూరిటీ కంపెనీతో ఈ దాడులపై పని చేస్తోంది.

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికా యూనిట్ మెక్ కామిష్ సిస్టమ్స్ లో సైబర్ దాడి జరినట్లు చెబుతున్నారు. సంస్థలోని కంప్యూటర్లలో కొన్ని యాప్స్, కంప్యూటర్లు కూడా సరిగ్గా పనిచేయడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. అయితే అసలు సమస్య ఏంటి అనే దానిపై పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఈ దాడులపై సంస్థ కూడా స్పందించింది. సంస్థలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు సైబర్ సెక్యూరిటీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఈ దాడిపై అంతర్గత దర్యాప్తు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ దాడి ప్రభావం కంప్యూటర్లు, డేటాపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉందన్నారు.

ఈ సమస్యపై సంస్థ స్పందిస్తూ.. “ఈ దాడిపై స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించాం. డేటా, సిస్టమ్స్ పై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. డేటా ప్రొటెక్షన్, సైబర్ సెక్యూరిటీ మాకు అత్యంత ప్రాధాన్యమైన అంశాలు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ కలిసి పని చేస్తున్నాం” అంటూ వెల్లడించారు. మరి.. ఇన్ఫోసిస్ కంపెనీపై సైబర్ దాడి జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి