iDreamPost

Chandrababu: BCలకు చంద్రబాబు వెన్నుపోటు.. భారీగా సీట్ల తగ్గింపు!

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అంటూ ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. ఆయన రాజకీయమంతా మోసం,వంచనలతోనే సాగిందని చెబుతుంటారు. తాజాగా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల జాబితాతో బీసీలకు వెన్నుపోటు పొడిచారట

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అంటూ ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. ఆయన రాజకీయమంతా మోసం,వంచనలతోనే సాగిందని చెబుతుంటారు. తాజాగా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల జాబితాతో బీసీలకు వెన్నుపోటు పొడిచారట

Chandrababu: BCలకు చంద్రబాబు వెన్నుపోటు.. భారీగా సీట్ల తగ్గింపు!

ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆయన వ్యతిరేకులు, ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు మోసం చేయడం, వంచిచడం, వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్యా అని ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. అలానే నమ్మిన వారిని నట్టేటా ముంచడంలో బాబు సిద్ధ హస్తుడని, అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తి, ఆ తరువాత భూమిలోకి తొక్కే నైజం చంద్రబాబుదని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతుంటారు. తాజాగా బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, అందుకు నిదర్శనం తాజాగా ఇచ్చిన సీట్లే అనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు..తమ పార్టీకీ బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లే వేస్తుంటారు. బీసీలను రాజకీయంగా నిలబెట్టిన పార్టీ తమదేనని, తానే ఎంతో బీసీలకు రాజకీయ జీవితం ప్రసాదించానంటూల  లేనిగొప్పలు చెబుతుంటారు. అయితే తాజాగా 2024లో టీడీపీ తరపున పోటీ చేసేవారి వివరాలు చూస్తే.. బీసీలకు బాబు వెన్నుపోటు పొడిచారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇటీవల విడుదల చేసిన టీడీపీ రెండు జాబితాల్లో బీసీలకు భారీగా సీట్ల తగ్గించారు. రెండు జాబితాల్లో కలిపి 24 సీట్లనే బీసీలకు కేటాయించింది.

గత ఎన్నికల్లో చూసినట్లు అయితే 43 ఇచ్చిన బాబు.. ఈసారి మాత్రం సగానికి సగం సీట్లు కోతపెట్టేశారు. ఇదే సమయంలో తన సొంత సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఆ మాటలను నిజం చేస్తూ ఇప్పటి వరకు విడుదలన టీడీపీ రెండు జాబితాల్లో  కమ్మ సామాజిక వర్గానికి ఏకంగా 28 సీట్లను కేటాయించారు. ఇంకా మరికొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న చంద్రబాబు.. కాపులకు 8, మైనారిటీలు 3 సీట్లకే పరిమితం చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిపై బీసీ, ఇతర సామాజి వర్గాల వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

బీసీలను టీడీపీకీ బ్యాక్ బోన్ అంటూ ఉత్తుత్తి మాటలతో దశాబ్దాలుగా చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారని పలువురు బీసీ నేతలు చెబుతున్నారు. అందుకు నిదర్శనంగా 2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీ వ్యక్తిని కూడా  పెద్దల సభ అయినా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. అంతేకాక బడుగుల బలహీన వర్గాలపై తనకున్న చిన్నచూపును అనేక పర్యాలు చూపించారు. ఎవవరైనా ఎస్సీలు పుట్టాలని కోరుకుంటారా అంటూ కించరిచే మాటలు మాట్లాడారు.

CBN cheating on BC

అలానే అనేక సందర్భాల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను బాబు చాటుకున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడ్డారు. తమ పార్టీకి బీసీలే బలం అని చెప్పిన బాబు.. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి సీట్ల విషయంలో బీసీలను దారుణంగా మోసం చేశారని పలువురు చెబుతున్నారు. వెన్నుపోటులో అనుభవం కలిగిన చంద్రబాబు తాజాగా బీసీలకు వెన్నుపోటు పొడిచారని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి