iDreamPost

హేరిటేజ్ విలువ ఎంత.. భువనేశ్వరి చెప్పింది నిజమేనా?

  • Published Sep 26, 2023 | 1:16 PMUpdated Sep 26, 2023 | 1:16 PM
  • Published Sep 26, 2023 | 1:16 PMUpdated Sep 26, 2023 | 1:16 PM
హేరిటేజ్ విలువ ఎంత.. భువనేశ్వరి చెప్పింది నిజమేనా?

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం కేసులో.. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో సుమారు రూ.371.25 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. దీంతో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక తన అరెస్ట్‌ను ఖండిస్తూ.. చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు కొట్టివేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇక చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో.. ఆయన భార్య భువనేశ్వరి మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. నేనూ ఓ కంపెనీని నడుపుతున్నా. అందులో 2 శాతం అమ్ముకున్నా నాకు ఏకంగా రూ.400 కోట్లు వస్తాయి. ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు’’ అంటూ హెరిటేజ్‌ కంపెనీని ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు. ఆమె లెక్క ప్రకారం హెరిటేజ్‌ కంపెనీ విలువ రూ.20 వేల కోట్లు అని లెక్కలు వేస్తున్నారు జనాలు. మరి భువనేశ్వరి చెప్పిన లెక్కల్లో నిజమెంత ఉంది.. అసలు హెరిటేజ్‌ విలువ ఎంత అంటే..

ఇదీ.. హెరిటేజ్‌ అసలు విలువ..

1992లో పెట్టిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి ప్రస్తుతం నారా భువనేశ్వరి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీకి సంబంధించి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 2023 సెప్టెంబర్‌ 21 నాటికి హెరిటేజ్‌ కంపెనీ విలువ (మార్కెట్‌ క్యాప్‌) రూ.2,181 కోట్లు. 2023లో ఆ కంపెనీ రెవెన్యూ రూ.3,241 కోట్లు. ఇక నెట్‌వర్త్‌ చూసుకుంటే రూ.756 కోట్లు మాత్రమే. కానీ భూవనేశ్వరి లెక్కల ప్రకారం చూసుకుంటూ.. హెరిటేజ్‌ విలువ ఏకంగా 20 వేల కోట్ల రూపాయలుగా ఉంది.

నోటికొచ్చిన లెక్కలు..

ఇంటర్నెట్‌లో చూసుకున్న ప్రకారం.. హెరిటేజ్‌ కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 2,181 కోట్లు. భువనేశ్వరి చెప్పిన దాని ప్రకారం.. దీనిలో 2 శాతం అమ్ముకుంటే.. లభించే మొత్తం కేవలం రూ.40 కోట్లు మాత్రమే. కానీ ఏకంగా 400 కోట్ల రూపాయలు వస్తాయంటూ భువనేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆమె ఇలా నోటికొచ్చిన లెక్కలు చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు జనాలు. బాబు బాటలో నడుస్తున్నారు కదా.. ఆయన లక్షణాలు వచ్చి ఉంటాయి అంటున్నారు జనాలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి