iDreamPost

బాబు డైరెక్షన్‌లోనే భువనేశ్వరి డైలాగ్స్‌.. కుప్పంలో ఓటమి భయంతోనే ఇదంతా

  • Published Feb 22, 2024 | 10:40 AMUpdated Feb 22, 2024 | 3:11 PM

Nara Bhuvaneshwari: కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. మరి ఆమె ఇలా మాట్లాడటం వెనక కారణాలు ఏంటి అంటే..

Nara Bhuvaneshwari: కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. మరి ఆమె ఇలా మాట్లాడటం వెనక కారణాలు ఏంటి అంటే..

  • Published Feb 22, 2024 | 10:40 AMUpdated Feb 22, 2024 | 3:11 PM
బాబు డైరెక్షన్‌లోనే భువనేశ్వరి డైలాగ్స్‌.. కుప్పంలో ఓటమి భయంతోనే ఇదంతా

రాజకీయాల్లో ఇటు పుల్ల అటు కదిలినా.. అటు పుల్ల ఇటు కదిలినా.. దాని వెనక పెద్ద వ్యూహమే ఉంది అంటారు. అలానే నేతలు చేసే వ్యాఖ్యలు వారి మనసులోని భావాలను ప్రతిబింబిస్తాయి. ఇక తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారియి. ఆమెదో సరదాకే అనింది అని టీడీపీ నేతలు కవర్‌ చేసే ప్రయత్నం చేస్తున్నా.. కాదు బాబు డైరెక్షన్‌లోనే భువనేశ్వరి నోటి వెంట ఈ డైలాగ్స్‌ వచ్చాయి.. వాస్తవంగా కూడా పరిస్థితి ఇలానే ఉంది అంటున్నారు రాజకీయ పండితులు.

భువనేశ్వరి బుధవారం నాడు.. కుప్పం నియోజక వర్గం శాంతిపురం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘‘35 ఏళ్లుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు. ఇక ఆయనకు రెస్ట్‌ ఇవ్వాలనిపిస్తోంది. అందుకే ఈ సారి ఇక్కడి నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను’’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇవి భువనేశ్వరి మనసులోని మాట కాదు.. బాబు గారి కోరికను ఆవిడిలా వెల్లడించారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే.. వాస్తవంగా చూస్తే.. ముందు నుంచి కూడా భువనేశ్వరి రాజకీయాలకు దూరంగా చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత ఆమె యాత్ర చేసినా.. అవన్ని స్క్రిప్ట్‌ ప్రకారమే ఉంటాయి. ఇక తాజాగా బుధవారం నాడు ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఆ స్క్రిప్ట్‌లో భాగమే అంటున్నారు.

35 ఏళ్లుగా కుప్పం చంద్రబాబుకు కంచుకోటగా ఉంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు అక్కడ కనీస అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నది వాస్తవం. సీఎం జగన్‌ కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించారు. చంద్రబాబు పాలనలో నీటి సమస్యను జగన్‌ తీర్చారు. దాంతో కుప్పంలో బాబు గ్రాఫ్‌ దారుణంగా పడిపోతుంది. ఈ విషయం టీడీపీ అధ్యక్షుడికి కూడా తెలుసు. కళ్లెదుట ఓటమి కనిపిస్తుండడంతో ఎలాగైనా కుప్పం పోటీ నుంచి తప్పుకుని పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారట. అందుకే భార్య చేత ఆ మాటలు మాట్లాడించారు తప్ప సరదాకు అన్న డైలాగ్స్‌ కాదని స్వయంగా టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

2019 ఎన్నికల్లోనే కుప్పంలో బాబు గెలుపు చాలా కష్టసాధ్యంగా మారింది. మెజారిటీ బాగా తగ్గిపోవటంతోనే అక్కడ ఆయన గ్రాఫ్‌ పడిపోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు చేతి నుంచి కుప్పం జారిపోయింది. మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది. 25 వార్డుల్లో టీడీపీ కేవలం 7 వార్డుల్లో గెలవగా.. మిగిలిన 18 వార్డుల్లోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89 పంచాయతీలకు గాను 70 చోట్ల వైసీపీ గెలిచింది. నాలుగు జెడ్‌పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. ఈ ఫలితాలన్నీ కుప్పంలో చంద్రబాబు పని అయిపోయినట్లేనని స్పష్టంగా చెప్పాయి.

జగన్‌ వచ్చాకే కుప్పంలో అభివృద్ధి..

చంద్రబాబు ఎన్ని సార్లు ముఖ్యమంత్రిగా చేసినా సరే.. తన సొంత నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం. ఏడుసార్లు ఆయనని గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆఖరికి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా హంద్రీనీవా నీళ్లు తెస్తానని మోసం చేశారే తప్ప మాట మీద నిలబడలేదు. కుప్పంలో అభివృద్ధి జరిగింది జగన్‌ హయాంలోనే. ఆ నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా నీళ్లు వచ్చినా.. దాన్ని మున్సిపాలిటీగా మార్చినా.. రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్‌ చేసినా.. అవన్నీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే జరిగాయి.

అంతేకాక కుప్పంలో 20వేల మందికి ఇళ్ల పట్టాలివ్వటంతో పాటు వాటిలో 10వేల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. నియోజకవర్గంలోని దాదాపు 90 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నా సరే.. బాబు కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. జగన్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కుప్పంలో తన గ్రాస్‌ పడిపోతుందని అర్థం చేసుకున్న బాబు అక్కడ ఓటమిని తప్పించుకోవటానికి కుప్పం నియోజకవర్గానికి గుడ్‌బై చెప్పే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అటు చూస్తే జగన్‌ సిద్ధం సభలకు జనాలు భారీగా తరలి వస్తుండగా.. లోకేష్‌ శంఖారావం సభలు అట్టర్‌ఫ్లాప్‌ అవుతున్నాయి.

దాంతో జనం నాడి అర్థమైన చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే పొత్తులతోనైనా ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుప్పంలో కూడా తాను ఓడిపోతే పరిస్థితి దయనీయంగా మారడమే కాక పార్టీ కూడా చేజారిపోతుందని అర్థమై.. ఈ సారికి వేరే చోట నుంచి పోటీ చెయ్యడమో… లేకపోతే ఎక్కడా పోటీ చేయకుండా ఉండి పరువు నిలుపుకోవటమో చేయాలని చూస్తున్నారన్నది పార్టీ వర్గాల మాట. అందుకు గుర్తుగా ఇలా భువనేశ్వరి చేత తన మనసులోని మాట పలికించినట్లు టీడీపీ కేడరే చెబుతుంది. మరి భువనేశ్వరి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి