iDreamPost

ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. చంద్రబాబు సతీమణి సేఫ్!

Indigo Flight Mishap: ఇటీవల దేశ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.. పైలట్ అప్రమత్తం కావడంతో సెఫ్ గా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Indigo Flight Mishap: ఇటీవల దేశ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.. పైలట్ అప్రమత్తం కావడంతో సెఫ్ గా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. చంద్రబాబు సతీమణి సేఫ్!

ఇటీవల దేశంలో తరుచూ విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తర్వాత విమానంలో టెక్నికల్ ఇబ్బంది, కమ్యూనికేషన్ లోపం, వాతావరణంలో ఆకస్మిక మార్పులు, ల్యాండిగ్ చేసే సమయంలో వీల్ ఊడిపోవడం, ఇంజన్ లో మంటలు చెలరేగడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అయితే ప్రమాదాన్ని ముందుగానే పసికట్టి పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ.. వందల మంది ప్రాణాలను రక్షిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ల్యాండ్‌ అయ్యేందుకు రన్‌వేపైకి వచ్చిన ఇండిగో విమానం ప్రమాదానికి గురైంది.. ఈ ఘటన గన్నవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్లిన ఇండిగో విమానం.. ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వే పైకి వచ్చింది. ఆ సమయానికి విమానం వీల్ తెరుచుకోలేదు.. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే టేకాఫ్ చేశాడు.  ఈ ఘటన తో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్తితి నెలకొంది. దాదాపు 20 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. తర్వాత వీల్ చైర్ తెరుచుకోవడంతో పైలట్ సేఫ్ గా ల్యాండింగ్ చేశాడు. ఏం జరుగుతుంతో అని అందరూ భయంతో వణికిపోయారు. ఆ సమయంలో విమానంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ప్రమాదం నుంచి ప్రయాణికులు బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి