iDreamPost

Chandrababu: కుప్పం ఢమాల్.. బాబు స్థానంలో బరిలో భువనేశ్వరి!

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇక విశ్రాంతి తీసుకోనున్నారా?, వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయడం లేదా?, ఆయన స్థానంలో భువనేశ్వరి బరిలో దిగనున్నారా?. ఈ ప్రశ్నలన్నిటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం..తాజాగా నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలే.

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇక విశ్రాంతి తీసుకోనున్నారా?, వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయడం లేదా?, ఆయన స్థానంలో భువనేశ్వరి బరిలో దిగనున్నారా?. ఈ ప్రశ్నలన్నిటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం..తాజాగా నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలే.

Chandrababu: కుప్పం ఢమాల్.. బాబు స్థానంలో బరిలో భువనేశ్వరి!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన త్వరలో కుప్పం గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి చంద్రబాబు కుప్ప నుంచి ఎమ్మెల్యే  గెలుస్తూ వచ్చారు. అయితే ఇంతకాలం సొంత నియోజవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏమిలేదు. అలానే కుప్పం నియోజవర్గానికి మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. దీంతో కుప్పంలో ఈసారి చంద్రబాబు ఓటమి ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఓ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేద్దామని భావిస్తున్నట్లు ఆమె బహిరంగ సభలో ప్రకటించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 1989 తొలిసారిగా కుప్పం నుంచి పోటీ చేశారు. ఇక అప్పటి నుంచి నేటి వరకు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల పాటు ఆయన కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే  చేసిన అభివృద్ధి మాత్రం చాలా తక్కువనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కుప్పం ప్రజలు మంచినీళ్లను  సౌకర్యం కూడా కల్పించలేదు. ఇప్పటి వరకు అక్కడ దొంగ ఓట్లతో గెలుస్తూ వచ్చారని ప్రత్యేర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పార్టీలకు అతీతంగా అన్నీ నియోజవర్గాలతో పాటు కుప్పాన్ని అభివృద్ధి చేశారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. అలానే అక్కడి ప్రజలకు నీటి సమస్యను తీర్చారు. అలా కుప్పం రూపు రేఖల్ని సీఎం జగన్ మార్చేశారు. అందుకే గతంలో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగరేసింది.

అక్కడ మొదలైన చంద్రబాబు పతనం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమనే టాక్ వరకు చేరింది. దీంతో చంద్రబాబుకు సైతం ఓటమి భయంతో నియోజకవర్గం మార్చుకునే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా తన సతీమణి నారా భువనేశ్వరితో తాజాగా ప్రకటన చేయించారనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. తాజాగా కుప్పంలో నిర్వహించిన నిజం గెలవాలి సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ..”కుప్పంకు వచ్చాను, ఇక్కడ నాకొక కోరిక ఉంది, నా మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది. నేనేమి మిమ్మిల్ని కొట్టను, తిట్టను. 35 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు రెస్ట్ తీసుకోమని చెబుతున్నాను. నేనే ఇక్కడి నుంచి పోటి చేద్దామని అనుకుంటున్నాను” అంటూ అక్కడి సభలో ఉన్నవారిని ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

అయితే భవనేశ్వరి చేసిన ప్రకటన అంతఆషామాషీగా అన్నవి కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఆమె చేసిన ఈ ప్రకటనను రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రకటనగానే చూడాలి. చాలా కాలంగా నియోజకవర్గం మార్చాలని బాబు భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే  సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు భువనేశ్వరితో  ప్రకటన చేయించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా భువనేశ్వరి మాటల్లో స్పష్టంగా ఏం చెప్పారంటే.. చంద్రబాబుక విశ్రాంతి కావాలని అన్నారు. జైల్లో ఉన్నప్పుడే ఎన్నో రోగాలున్నాయని కోర్టుకు  నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. వృద్ధాప్యం పెరగడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారంట. అలానే కొడుకు లోకేశ్ ను ఎంత ఎంకరేజ్ చేసిన ఫలితం మాత్రం శూన్యమనే భావనలో బాబు ఉన్నారని టాక్. అందుకే ఆయన  భార్య  భువనేశ్వరి చేత ఈ ప్రకటన చేయించారని పొలిటికల్ ఎనలిస్ట్ లు అభిప్రాయ పడుతున్నారు. మరి.. నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి