iDreamPost

నా సామిరంగా.. అప్పుడే బ్రేక్ ఈవెన్

Naa Saami Ranga Break Even Completed: ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలలో .. అక్కినేని నాగార్జున నటించిన 'నా సామి రంగ' ఒకటి. నాగార్జున అభిమానులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రానికి అప్పుడే బ్రేక్ ఈవెన్ వసూళ్లు వచేశాయట.

Naa Saami Ranga Break Even Completed: ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలలో .. అక్కినేని నాగార్జున నటించిన 'నా సామి రంగ' ఒకటి. నాగార్జున అభిమానులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రానికి అప్పుడే బ్రేక్ ఈవెన్ వసూళ్లు వచేశాయట.

నా సామిరంగా.. అప్పుడే బ్రేక్ ఈవెన్

పేరుకు తగ్గట్టుగానే నా సామిరంగా అదరగొట్టింది. అక్కినేని నాగార్జున మాయాజాలం మైకం తెచ్చింది. సైకిల్ చెయిన్ పట్టుకన్నారు. చెయిన్లో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వడం, అంతకు ముందు బ్రేక్ ఈవెన్ కి రావడం అన్నమాటలే తెలుగు సినీ పరశ్రమ దాదాపుగా మర్చిపోయింది. దారుణంగా ఉంది పరిస్థితి. మెగాస్టార్ లాంటి హీరో ఇటీవల చేసిన కొన్ని సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిపోయాయి. మరెన్నో సినిమాలు పూర్తిగా గల్లంతయిపోయాయి. అటువంటి దశ నడుస్తోంది ప్రస్తుతం.

ఇలాంటి పరిస్థితులలో నాగార్జున నటించిన నా సామిరంగా విడుదల రోజునే హిట్ టాక్ తెచ్చుకుందంటే.. అది కేవలం నాగార్జున మ్యాజిక్ మాత్రమేనని ఒప్పుకోవాలి. శివ సినిమాతో ఫస్ట్ టైం డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ నాగార్జున చేతికి సైకిల్ చైన్ ఇస్తే.. బాక్సాఫీసు మీద పడ్డ చారలు ఇప్పటికీ ఇంకా మారలేదు, మాయలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి ఫస్ట్ టైం డైరెక్టర్ సీటులో కూర్చున్న కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని నాగార్జున చేతికి.. మళ్ళీ మరోసారి సైకిల్ చైన్ ఇస్తే, ధియేటర్ దద్దరిల్లిపోయింది. మళ్ళీ హిట్ కొట్టి చెక్కుచెదరని తన స్టామినాని నాగార్జున రుచి చూపించారు.

Naa Saami Ranga

తన రొమాంటిక్ లుక్ ని పక్కనబెట్టి మరీ నాగార్జున నా సామిరంగాలో ఓ నాటు క్యారెక్టర్ని చేయడానికి సిద్ధపడ్డారు. అంటే తన మీద తనకి ఉన్న నమ్మకాన్ని ప్రేక్షకుల చేతి నమ్మించే ఓ ప్రయత్నం ఇది. అందులో ఆయన నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు. యంగ్ హీరోలు ఎందరు వచ్చినా.. తన ఫామిలీలోనే అటువంటి యంగ్ హీరోలున్నా కూడా.. తన స్టాంపుని మళ్ళీ మరోసారి ప్రూవ్ చేసుకోవడం నిజంగా నాగార్జునకే చెల్లింది. సాధారణంగా తమ ఇమేజ్ కి విరుద్ధంగా చేయడానికి పెద్ద ఇమేజ్ ఉన్న హీరోలు సిద్దపడరు. కానీ నాగార్జున ఇందుకు మొదటనుంచి వ్యతిరేకమే. ఏదైనా రిస్క్ అంటే ఆయనే ముందడుగు వేసేది.

రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడో కూడా తెలియని రోజుల్లో, ఎవ్వరూ వర్మని నమ్మని రోజుల్లో వర్మ చేతికి మైక్రోఫోన్ ఇప్పించిన స్పెషాలిటీ నాగార్జునదే. ఇప్పుడు మళ్ళీ ఇంతమంది డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉండగా, ఓ కొరియోగ్రాఫర్ని, అదీ ఏ అనుభవం లేని విజయ్ బిన్నికి అవకాశం ఇచ్చారంటే నిజంగా నాగార్జునకి హేట్సాఫ్. తను నమ్మారు. ప్రేక్షకుల చేత నమ్మించారు. ఫలితంగా తిరుగులేని హిట్టే కొట్టారు. సో…కింగ్ ఈజ్ బేక్ ఎగైన్. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్లస్ ఆడియన్స్ కి నా సామిరంగా నిజంగా సంక్రాంతిని అందించింది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి సైలెంట్ గా ఉంటారని గానీ, వైలెంట్ హిట్టే ఇచ్చారు. కంగ్రాట్స్ నా సామిరంగా టీం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి