iDreamPost
android-app
ios-app

వీడియో: బర్త్ డే పార్టీలో నాగ్ అశ్విన్ మాస్ డ్యాన్స్! నాగీలో ఈ యాంగిల్ చూసి ఉండరు

ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కల్కి. మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా, నాగ్ అశ్విన్ పుట్టిన రోజునైనా అప్డేట్ ఇస్తారు అనుకున్నారు .. కానీ

ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కల్కి. మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా, నాగ్ అశ్విన్ పుట్టిన రోజునైనా అప్డేట్ ఇస్తారు అనుకున్నారు .. కానీ

వీడియో: బర్త్ డే పార్టీలో నాగ్ అశ్విన్ మాస్ డ్యాన్స్! నాగీలో ఈ యాంగిల్  చూసి ఉండరు

ఎన్ని సినిమాలు చేశామనేది కాదు ముఖ్యం. ప్రేక్షకులకు గుండెల్లో చిరస్థాయిగా గుర్తిండిపోయే ఎన్ని చిత్రాలు తెరకెక్కించామన్నదే ఇంపార్టెంట్. ఇది నాగ్ అశ్విన్ విషయంలో అక్షర సత్యం. గట్టిగా రెండు చిత్రాలు తెరకెక్కించాడు. ఓ చిన్న స్టోరీకి డైరెక్షన్ మాత్రమే చేశాడు. కానీ ఈ మూవీస్ అతడి క్రేజ్ ఏంటో తెలియజేశాయి. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి కెరీర్ స్టార్ చేసిన నాగీ.. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్‌లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది కల్కి 2898 AD. భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, అశ్వత్ధామ లుక్స్ సినిమాపై ప్రేక్షకులు హయ్యర్ ఎక్ట్ పెక్టేషన్స్ పెట్టుకునేలా చేశాయి.

మే 9న సినిమా విడుదల  చేస్తున్నట్లు తొలుత ఎనౌన్స్ జరిగింది. కానీ పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.  కాగా, ఈ నెల 23న ఈ వర్సటైల్ డైరెక్టర్ బర్త్ డే. ఈ సందర్భంగా అయిన ప్రకటిస్తారు అనుకున్నారు. కానీ రాలేదు. అయితే నాగ్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా కల్కి చిత్ర యూనిట్ టీం విషెస్ చేస్తూ స్పెషల్ వీడియో చేసింది. అలాగే.. నాగీ బర్త్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. ఇందులో చాలా హుషారుగా చిందులేస్తూ కనిపించాడు నాగీ. ఎప్పుడు వర్క్ మోడ్‌లో కనిపించే నాగ్ అశ్విన్‌ను ఈ యాంగిల్లో చూసి ఉండరు. మ.. మ.. మాస్ అంటూ మాస్ సినిమాలోని పాటకు అచ్చు నాగార్జునలా ట్రై చేశాడు నాగీ. అలాగే తన భార్య ప్రియాంక దత్ తో కలిసి రొమాంటిక్ స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఈ దర్శకుడిలో ఏదో మ్యాటర్ ఉంది అనిపించుకున్నాడు. ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహా నటి సినిమా తీసి.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఆ తర్వాత పిట్టకథలు వంటి అంథాలజీ మూవీకి ఓ చిన్న పోర్షన్‌ను డైరెక్షన్ చేశాడు. ప్రొడ్యూసర్‌గా మారి.. జాతి రత్నాలు చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పుడు కల్కితో రాబోతున్నాడు. సుమారు 600 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్, కోలీవుడ్ దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమితాబ్, దీపికా పడుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు చేస్తున్నారు. వైజయంంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by CELLULOID PANDA (@celluloid_panda)

Jojobet GirişMadridbetMadridbetbetciomatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerbetparkdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet