iDreamPost
android-app
ios-app

నటించొద్దంటూ హీరో కుటుంబాన్ని బెదిరించారు.. దిగ్గజ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

నటించొద్దంటూ హీరో కుటుంబాన్ని బెదిరించారు.. దిగ్గజ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

క్రికెట్ ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ గురించి తెలియని క్రికెట్ ప్రియులు ఉండరనే చెప్పాలి. ఎందుకంటే క్రికెట్ హిస్ట్రీలో తన ఆటతీరు, తన పేరిట లిఖించుకున్న రికార్డులు ముత్తయ్యను మరిచిపోకుండా చేస్తాయి. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు శ్రీలంకకు చెందిన క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఈ నేపథ్యంలోనే ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘800’. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ముత్తయ్య నటుడు విజయ్ సేతుపతి గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడానికి అదే కారణమని వెల్లడించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ముత్తయ్య మురళీధరన్ జీవిత కథతో తెరకెక్కిన సినిమా 800. అయితే ఈ సినిమాలో మొదటగా విజయ్ సేతుపతినే ఎంచుకున్నారని తెలిపాడు. దీనికి సంబంధించి ఓ ఒప్పందం కూడా కుదిరినట్లు తెలిపాడు. కానీ ఈ విషయం బయటికి రావడంతో తమిళనాడుకు చెందిన పలువురు వ్యక్తులు హీరో విజయ్ ని, అతడి కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేశారని తెలిపాడు. ఈ కారణంగానే అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వెల్లడించాడు.

అయితే తమిళనాడుకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీలంకలో తమిళ ఉధ్యమంలో ముత్తయ్య మురళీధరన్ తమిళుల వైపు ఎప్పుడూ నిలబడలేదని అటువంటి వ్యక్తి బయోపిక్ లో తమిళ నటుడు నటించడానికి వీల్లేదంటూ హెచ్చిరించారు. ఈ కారణంగానే విజయ్ సేతుపతికి ఏ విధమైన నష్టం వాటిల్లకుండా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని కోరినట్లు ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు. కాగా ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో లెజెండరీ ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘800’ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/