iDreamPost

Muta Mestri : మార్కెట్ కూలీ మంత్రి అయితే

అప్పుడు చిరంజీవి రాజకీయాల్లోకి రావడం గురించిన ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ ప్రభ తగ్గుతోంది కాబట్టి ఆయన స్థానాన్ని చిరు భర్తీ చేస్తారనే విధంగా మీడియాలో రకరకాల కథనాలు వచ్చేవి. ఈ ముఠామేస్త్రిలోనూ ఆ అంశాన్ని టచ్ చేయడంతో పొలిటికల్ సర్కిల్స్ కూడా దీని గురించి మాట్లాడుకునేవి.

అప్పుడు చిరంజీవి రాజకీయాల్లోకి రావడం గురించిన ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ ప్రభ తగ్గుతోంది కాబట్టి ఆయన స్థానాన్ని చిరు భర్తీ చేస్తారనే విధంగా మీడియాలో రకరకాల కథనాలు వచ్చేవి. ఈ ముఠామేస్త్రిలోనూ ఆ అంశాన్ని టచ్ చేయడంతో పొలిటికల్ సర్కిల్స్ కూడా దీని గురించి మాట్లాడుకునేవి.

Muta Mestri : మార్కెట్ కూలీ మంత్రి అయితే

1992 సంవత్సరం, మెగాస్టార్ చిరంజీవికి పీక్స్ టైం. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు మూడు పోటాపోటీగా ఆడిన సూపర్ బ్లాక్ బస్టర్స్. చిరు కె విశ్వనాథ్ ఆపద్బాంధవుడు చేస్తున్న టైంలో నిర్మాతలు కెసి శేఖర్ బాబు, డి శివప్రసాద్ రెడ్డికి గతంలో ఇచ్చిన కమిట్ మెంట్ మేరకు విడివిడిగా సినిమాలు ఒప్పుకునే పరిస్థితి లేకపోవడంతో ఇద్దరిని కంబైన్డ్ గా ఓ సినిమాకు ఒప్పించారు. ఎన్నో సబ్జెక్టులు ప్రతిపాదన దశలో వచ్చినా ప్రముఖ తమిళ రచయిత బాలమురుగన్ తనయుడు భూపతిరాజా అందించిన కథ అందరికీ బాగా నచ్చింది. మార్కెట్ లో మూటలు మోసి రోజు కూలీ తీసుకునే వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్లడమనే పాయింట్ బాగా ఆకట్టుకుంది,

అప్పుడు చిరంజీవి రాజకీయాల్లోకి రావడం గురించిన ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ ప్రభ తగ్గుతోంది కాబట్టి ఆయన స్థానాన్ని చిరు భర్తీ చేస్తారనే విధంగా మీడియాలో రకరకాల కథనాలు వచ్చేవి. ఈ ముఠామేస్త్రిలోనూ ఆ అంశాన్ని టచ్ చేయడంతో పొలిటికల్ సర్కిల్స్ కూడా దీని గురించి మాట్లాడుకునేవి. 1989 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు తర్వాత ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా చేయలేదు. ఇద్దరికీ ఏవో విబేధాలు వచ్చాయనే గాసిప్స్ కు రెక్కలు వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ దీనికి దర్శకుడిగా ఆయన్నే తీసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ రచన చేయగా రాజ్ కోటి అద్భుతమైన మాస్ ఆల్బమ్ ని సిద్ధం చేశారు.

హీరోయిన్లుగా తక్కువ అనుభవం ఉన్న మీనా, రోజాలను లాక్ చేయడం వాళ్లకు జాక్ పాట్ కొట్టినట్టు అయ్యింది. విలన్ గా శరత్ సక్సేనాను బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు. శ్రీహరి ఆయన అబ్బాయిగా కనిపిస్తారు. అల్లు, సోమయాజులు, మన్సూర్ అలీఖాన్, కోట, బ్రహ్మానందం, యువరాణి తదితరులు ఇతర తారాగణం. 1993 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ భారీ డిమాండ్ కు తగ్గట్టు ప్రింట్లు సిద్ధం చేయలేక ల్యాబులు ఆలస్యం చేశాయి. కొన్ని సెన్సార్ ఇబ్బందులు కూడా తలెత్తాయి. అన్ని ముగించుకుని ఎట్టకేలకు జనవరి 17 రికార్డు స్థాయిలో బిజినెస్ జరుపుకుని ముఠామేస్త్రి రిలీజయింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఉండటంతో కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఇప్పటికీ బెస్ట్ డాన్స్ నెంబర్ అని చెప్పొచ్చు

Also Read : Devadas : అజరామర ప్రేమకథకు నిదర్శనం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి