iDreamPost

OTTలోకి వచ్చేసిన కరిష్మా కపూర్‌ రొమాటింక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఎక్కడ చూడొచ్చంటే

  • Published Mar 15, 2024 | 11:16 AMUpdated Mar 15, 2024 | 11:16 AM

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ మర్డర్ ముబారక్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకి ఎక్కడంటే..

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ మర్డర్ ముబారక్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Mar 15, 2024 | 11:16 AMUpdated Mar 15, 2024 | 11:16 AM
OTTలోకి వచ్చేసిన కరిష్మా కపూర్‌ రొమాటింక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఎక్కడ చూడొచ్చంటే

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఓటీటీ ట్రెండ్ అనేది ఎక్కువగా నడుస్తోంది. అందుచేత ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో హారర్, క్రైమ్, అడల్ట్ ఫాంటసీ, కామెడీ వంటి జోనర్లల వైపే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కనుక ప్రేక్షకుల అభిరుచుల మేరకు దర్శక, నిర్మాతలు కూడా థియేటర్లలో చూపించని కంటెంట్ సినిమాలను ఓటటీ ద్వారా చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే భాషతో సంబంధం లేకుండా రకరకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చేస్తున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా మరో క్రైమ్ అండ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఆ సినిమానే ‘మర్డర్ ముబారక్’. ఇందులో బాలీవు స్టార్ కిడ్ సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ పామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకి ఎక్కడంటే..

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మర్డర్ ముబారక్’. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు పాపులర్ డైరెక్టర్ హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. కాగా, మర్డర్ ముబారక్ సినిమాను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ హక్కులను కొనుగోలు చేసుకుంది. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమాను మార్చ 15వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇదివరకే నెట్‌ఫ్లిక్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అనుకున్నట్టుగానే ఈ సినిమా నేటి (మార్చి15) నుంచి నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. కాగా, మర్డర్ ముబారక్ మూవీను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక క్రైమ్ అండ్ మిస్టరీ, ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి మర్డర్ ముబారక్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Karishma kapoor murders mubarak in OTT

కాగా, మర్డర్ ముబారక్ అనే సినిమాను అనుజా చౌహాన్ రాసిన క్లబ్ యూ టు డెత్ నవల ఆధారంగా తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాలో సారా అలీ ఖాన్‌తో పాటు వెర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, సుహైల్ నయ్యర్, తారా అలీషా బెర్నీ వంటి అగ్ర తారలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో దినేష్ నిర్మాత వ్యవహరించగా.. సచిన్ జిగర్ సంగీతం అందించారు.

ఇక మర్డర్ ముబారక్ కథ విషయానికొస్తే.. మర్డర్ ముబారక్‌లో పంకజ్ త్రిపాఠి పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. సంపన్నుల సభ్యులుగా ఉండే ది రాయల్ ఢిల్లీ క్లబ్‌లో హత్య జరుగుతుంది. అయితే సంచలనం రేపిన ఈ హత్య వెనుక ఉన్న కారణాలు, అలాగే ఈ మర్డర్ ఎవరు చేశారు అనే మిస్టరీ ఛేదించేందుకు పవర్ ఫుల్ ఫోలీస్ ఆఫీసర్ భవానీ సింగ్ (పంకజ్ త్రిపాఠి) రంగంలోకి దిగుతాడు. ఈ కేసును అతను ఎలా సాల్వ్ చేశాడు. ఎవరిపై అనుమానాలు వచ్చారు. హత్యలో ఎవరి హస్తం ఉందనే అంశాల చుట్టూ తిరుగుతుంది మర్డర్ ముబారక్. మరి, అలస్యం చేయకుండా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్న మర్డర్ ముబారక్ సినిమాను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి