Krishna Kowshik
Krishna Kowshik
ప్రస్తుతం భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలు, ఉద్యోగం, సంపాదన అంటూ బతికేస్తున్నారు. ఇంట్లో అన్ని పనులు చేసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఇందులో వంటకు కనీసం గంటైనా కేటాయించాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో హోటల్స్ నుండి ఫుడ్ ఆర్డర్స్ చేసేస్తూ ఉంటారు. కేవలం రుచిని మాత్రమే చూస్తుండటం వల్ల శుచి, శుభ్రతను పట్టించుకోవడం లేదు చాలా మంది. వీకెండ్స్ అయితే ఇక రోజంతా వంట చేసుకోరు. వారంలో ఒక్కసారైనా రెస్ట్ కావాలన్న ఉద్దేశంతో బయటకు వెళ్లి, హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ తింటున్నారు. వ్యాపారమే పరమావధిగా భావిస్తున్న రెస్టారెంట్స్ వంటల్లో ఏ జీవి పడినా పట్టించుకోవడం లేదు. అలాగే కస్టమర్లకు అందిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఆహారంలో జీవాలు బయటపడిన సంగతి విదితమే.
తాజాగా ప్రముఖ హోటల్‌లో ఓ వంటకంలో ఏకంగా ఎలుక పిల్ల కనిపించింది. బిత్తరపోయిన కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు దీన్ని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఎ) అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌డీఎ దాడులు చేయగా.. ప్రముఖ హోటల్స్ వంట గదులను చూసి బిత్తర పోవడం అధికారుల వంతైంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ముంబయికి చెందిన ఓ జంట ప్రముఖ పాపా పంచో రెస్టారెంట్‌కి భోజనానికి వెళ్లింది. రోటీ, చికెన్, మటన్ కర్రీలు ఉన్న ప్లేట్‌ను ఆర్డర్ చేశారు. చికెన్ కర్రీ తింటుండగా.. ఒక ముక్క కాస్త తేడాగా అనిపించింది. అది బాగా గమనించగా.. చికెన్ కాదూ.. చనిపోయిన ఎలుక పిల్ల అని గుర్తించారు. ఖంగుతిన్న వెంటనే రెస్టారెంట్ యాజమానులకు తెలియజేశారు. వారేదో కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు.
వెంటనే ఆ దంపతులు బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం ముంబయి నగరం అంతటా వ్యాపించింది. సీరియస్ గా తీసుకున్న ఎఫ్‌డీఏ రంగంలోకి పలు హోటల్స్, రెస్టారెంట్లపై దాడులు జరిపారు. పరిశుభ్రత పాటించని హోటల్స్, రెస్టారెంట్లపై కొరడా ఝుళిపించారు. ఆ రెస్టారెంట్లలో ఒకటి అతి పురాతన బడేమియా రెస్టారెంట్ కూడా ఉంది. దీనికి 77 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే రైడ్స్ చేసే సమయంలో వంటగది అపరిశుభ్రంగా ఉంది. బొద్దింకలు, ఎలుకలు తిరుగుతుండటంతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఏ అనుమతి లేకపోవడంతో దీన్ని సీల్ చేశారు. ఈ హోటల్ దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉంది