iDreamPost

ముంబయి జట్టులో వర్గపోరు? కావాలనే వాళ్లంతా బాగా ఆడట్లేదా?

Mumbail Players Wantedly Failing: ఐపీఎల్ 2024 సీజన్లో ముంబయి ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో దూసుకెళ్తోంది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అది స్పష్టంగా కనిపించింది. ఈ ప్రదర్శనకు కారణం జట్టు రెండుగా విడిపోవడమే అంటున్నారు.

Mumbail Players Wantedly Failing: ఐపీఎల్ 2024 సీజన్లో ముంబయి ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో దూసుకెళ్తోంది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అది స్పష్టంగా కనిపించింది. ఈ ప్రదర్శనకు కారణం జట్టు రెండుగా విడిపోవడమే అంటున్నారు.

ముంబయి జట్టులో వర్గపోరు? కావాలనే వాళ్లంతా బాగా ఆడట్లేదా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ప్రతి టీమ్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. కానీ, అత్యధిక టైటిల్స్ సాధించిన ముంబయి ఇండియన్స్ మాత్రం ఇప్పటికీ ఖాతా తెరవలేదు. రాజస్థాన్ తో మ్యాచ్ లో కూడా ముంబయి ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ఒకవేళ విజయం సాధించినా కూడా ఈ మ్యాచ్ పై పలు అనుమానాలు వినిపిస్తున్నాయి. ముంబయి జట్టులో వర్గపోరు తారాస్థాయికి చేరిందని చెప్తున్నారు. హార్దిక్ పాండ్యాని టార్గెట్ చేస్తూ కావాలనే ముంబయి బ్యాటర్స్ సరిగ్గా ఆడటం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ ని కూడా దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్లో ముంబయి ఇండియన్స్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎప్పుడైతే రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ పగ్గాలు లాక్కున్నారో అప్పటి నుంచి ముంబయి జట్టులో రెండు వర్గాలు ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. నిజానికి జట్టు రెండు విడిపోయింది మాత్రం వాస్తవంగానే కనిపిస్తోంది. అయితే ఈ రెండు వర్గాల్లో ఒకటి రోహిత్ శర్మకు సపోర్ట్ కాగా.. ఇంకో వర్గం హార్దిక్ పాండ్యాకు సపోర్ట్ గా ఉన్నట్లు చెప్తున్నారు. రోహిత్ వర్గం కావాలనే హార్దిక్ పాండ్యాని టార్గెట్ చేస్తున్నారు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముంబయికి వరుస ఓటములు వస్తే.. హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని, తిరిగి ఆ క్పెటన్సీ బాధ్యత రోహిత్ కు దక్కుతుందని ఇలా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అందుకు ఉదాహరణగా ఇప్పటివరకు లీగ్ లో ముంబయి ఖాతా తెరవకపోవడం, ముంబయి ఇండియన్స్ జట్టులో కొందరు ఆటగాళ్ల ప్రదర్శనను ఉదాహరణగా చెప్తున్నారు. విషయం ఏంటంటే.. వాంఖడే వేదికగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ముంబయి బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్స్ ప్రదర్శన చూసిన తర్వాత నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ కోసమే కొందరు ఆటగాళ్లు సరిగ్గా ఆడటం లేదు అంటున్నారు. ముంబయి జట్టులో వరుసగా అద్భుతంగా రాణిస్తోంది కేవలం తిలక్ వర్మ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో కూడా 32 పరుగులు చేశాడు.

తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా పార్టీ కాబట్టే వరసుగా ఆడుతున్నాడు అని చెప్తున్నారు. కానీ.. ఇషాన్ కిషన్, జాస్ప్రిత్ బుమ్రా, జట్టులో లేని సూర్యకుమార్ వంటి వాళ్లు రోహిత్ కోసమే పనిచేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రోహిత్ శర్మ ఆడుతున్నా కానీ.. అది అతని స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే కాదు అంటున్నారు. ఇలాంటి వాదనలను ఏకపక్షంగా నమ్మడానికి లేదు. ఐపీఎల్ అనేది ప్రొఫెషనల్స్ ఆడే గేమ్. వారికి ఇప్పుడు చెపపుకునే లాంటి మైండ్ సెట్ ఉండకపోవచ్చు. కానీ.. ముంబయి ఇండియన్స్ టీమ్ ఆట, ఔటవ్వడం మాత్రం టీమ్ లో ఉన్న లుకలుకలే కారణంగా చెప్తున్నారు. ఇకనైనా విజయాల బాట పడితే ముంబయి జట్టు మీద వస్తున్న ఈ రూమర్స్ కి చెక్ పెట్టినట్లు అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి