iDreamPost
android-app
ios-app

టీమిండియా ప్లేయర్ దీన గాథ.. నా దగ్గర డబ్బుల్లేవ్ అందుకే బౌలింగ్!

  • Author Soma Sekhar Updated - 09:58 PM, Sat - 25 November 23

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు టీమిండియా పేసర్ ముకేష్ కుమార్. అయితే తాను బౌలర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు టీమిండియా పేసర్ ముకేష్ కుమార్. అయితే తాను బౌలర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు.

  • Author Soma Sekhar Updated - 09:58 PM, Sat - 25 November 23
టీమిండియా ప్లేయర్ దీన గాథ.. నా దగ్గర డబ్బుల్లేవ్ అందుకే బౌలింగ్!

సెలబ్రిటీలు అనగానే అందరికీ లగ్జరీ కార్లు, బైకులు, పెద్ద పెద్ద బంగళాలు జనాల ఆలోచనల్లో మెదులుతాయి. కానీ వారు ఆ స్థాయికి రావడానికి ఎలాంటి కష్టాలు పడ్డారో చాలా మందికి తెలీదు. సందర్భాన్ని బట్టి వారు చెబితే గానీ వాళ్ల జీవితంలో ఉన్న కన్నీటి గాథలు బయటి ప్రపంచానికి తెలీవు. తాజాగా తన లైఫ్ లో తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు టీమిండియా యువ పేసర్ ముకేశ్ కుమార్. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు ఈ పేసర్. దీంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. అయితే తాను బౌలర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు.

ముకేశ్ కుమార్.. ప్రస్తుతం టీమిండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించగల సత్తా ఉన్న బౌలర్. అనూహ్యంగా ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు ఎంపికైయ్యాడు ఈ స్టార్ పేసర్. ఇక తనపై సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. ఆసీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. మిగతా బౌలర్లు దారాళంగా పరుగులు ఇస్తున్న క్రమంలో ఇతడు మాత్రం పరుగులు ఇవ్వడంలో పిసినారి తనం చేశాడు. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అప్పుడు క్రీజ్ లో స్టార్ బ్యాటర్లు మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్ ఉండటం గమనార్హం. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నాడు ముకేశ్ కుమార్.

ఓ స్పోర్ట్స్ ఛానల్ తో ముకేశ్ కుమార్ మాట్లాడుతూ..”నా దగ్గర ఎక్కువగా డబ్బులు ఉండకపోయేవి. దీంతో నేను మెుత్తం క్రికెట్ కిట్ ను కొనలేకపోయేవాడిని. కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో నేను బ్యాటింగ్ కూడా చేసేవాడిని. కానీ డబ్బులు లేక కిట్టు కొనలేక బౌలింగ్ కు షిఫ్ట్ అయ్యాను” అంటూ తన దీన గాథను వివరించాడు. కింది స్థాయి నుంచి టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి ముకేష్ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియజెప్పడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. క్రికెట్ కిట్ కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇది అందరికీ సాధ్యం అయ్యే పనికాదు. ముకేష్ కుమార్ లాంటి ఎంతో మంది యువ క్రికెటర్లు ఆర్థిక కారణాలతో తమ కెరీర్ ను మధ్యలోనే ముగిస్తున్నారు. అలాంటి వారిని ఆదుకోవాలని ముకేష్ పరిస్థితి చూసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎన్నో కష్టాలను ఎదుర్కొని టీమిండియాలో చోటు దక్కించుకున్న ముకేష్ కుమార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sachin Born To Win (@sachinborntowin)