iDreamPost

కాబోయే కోడలికి అంబానీ లగ్జరీ గిఫ్ట్స్! ఆ ఒక్క గిఫ్ట్ చాలా స్పెషల్!

  • Published Feb 22, 2024 | 1:26 PMUpdated Feb 22, 2024 | 1:26 PM

దేశంలో అత్యంత సంపన్నుల గల కుటుంబం అయిన అంబానీ ఫ్యామీలి గురించి అందరికి తెలిసిందే. వీరు ఎదుట వారికి కానుకలు ఇవ్వడంలో ఏమాత్రం వెనుకాడరని సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంబానీ ఫ్యామీలి తమ కాబోయే కోడలికి మాత్రం అంబానీ ఫ్యామీలి ఇచ్చే కానుక తెలిస్తే ఆశ్చర్యపోతారు.

దేశంలో అత్యంత సంపన్నుల గల కుటుంబం అయిన అంబానీ ఫ్యామీలి గురించి అందరికి తెలిసిందే. వీరు ఎదుట వారికి కానుకలు ఇవ్వడంలో ఏమాత్రం వెనుకాడరని సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంబానీ ఫ్యామీలి తమ కాబోయే కోడలికి మాత్రం అంబానీ ఫ్యామీలి ఇచ్చే కానుక తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Feb 22, 2024 | 1:26 PMUpdated Feb 22, 2024 | 1:26 PM
కాబోయే కోడలికి అంబానీ లగ్జరీ గిఫ్ట్స్! ఆ ఒక్క గిఫ్ట్ చాలా స్పెషల్!

భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త ‘ముకేశ్ అంబానీ’ గురించి అందరికి తెలిసిందే. ఈయన ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇక వరల్డ్ వైడ్ గా తన సామ్రాజ్యాన్ని విస్తరించి బిజినెస్ కింగ్ గా ముకేశ్ అంబానీ కొనసాగుతున్నాడు. అంతేకాకుండా దేశంలో అత్యంత సంపన్నుల గల కుటుంబం ఎవరిది అనే ప్రశ్నకు టక్కున చెప్పే పేరు కూడా అంబానీ ఫ్యమీలిదే. మరి, అలాంటి విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ.. ఎవరికైనా కానుకలు ఇవ్వడంలో ఏమాత్రం వెనకాడరని చాలా సందర్భాల్లో నిరూపించారు. అయితే తాజాగా ఇప్పుడు తమ కాబోయే కోడలికి మాత్రం అంబానీ ఫ్యామీలి ఇచ్చే కానుకను తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎదుట వారికి కానుకలు ఇవ్వడంలో అంబానీ కుటుంబం తర్వాతే ఎవరైనా అనడంలో సందేహం లేదు. అయితే త్వరలో ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి, రాధిక మర్చంట్ కి మరికొద్ది రోజుల్లో వివాహం జరగనున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా మొదలైయ్యాయి. ఇందులో భాగంగానే తమకు కాబోయే కోడలు రాధికా మర్చంట్ కు అంబానీ కుటుంబం కోట్లు విలువ చేసే లగ్జరీ గిఫ్ట్స్ ను అందించినట్లు సమాచారం.

అయితే ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమకు కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కు వెండి లక్ష్మీ గణపతి గిఫ్ట్ హ్యాంపర్ అందించగా.. ఈ గిఫ్ట్ లో రెండు సిల్వర్ తులసి పాట్స్, ఒక సిల్వర్ స్టిక్ స్టాండ్, ఒక లక్ష్మీ గణపతి విగ్రహం ఉన్నాయి. వీటితో పాటు తెల్లటి పూలు, ఇతర నగలతో కలిపి ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. మరోవైపు.. రాధికా మర్చంట్‌కు వారి ఎంగేజ్‌మెంట్ డే సందర్భంగా.. ముకేశ్ అంబానీ ఖరీదైన బెంట్లీ కారు ఇచ్చారు. దీని ఖరీదు రూ.4.5 కోట్లు ఉంటుంది. మన దేశంలో అంతటి లగ్జరీ కారు అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో మన సెలబ్రిటీస్ అయిన విరాట్ కోహ్లీ, ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ వంటి వారి వద్ద మాత్రమే ఉంది.

అలాగే.. ముకేశ్ అంబానీ మేనకోడలు, ఇషేతా సల్గావోకర్ కాక్‌టెయిల్ పార్టీకి వచ్చిన రాధికా మర్చంట్.. అద్భుతమైన ముత్యాలు, వజ్రాల హారంలో కనిపించారు. పైగా ఆ నెక్లెస్ తనకు కాబోయే అత్తగారు నీతా అంబానికి చెందినదిగా సమాచారం. వివాహ కానుకగా తన డైమండ్ చౌకర్‌ను రాధికా మర్చంట్‌కి నీతా అంబానీ అందించినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్‌ లో కూడా నీతా అంబానీ అదే నెక్లెస్ ధరించడం గమనార్హం. మరి, కాబోయే కోడలికి అత్యంత ఖరీదైన కానుకలను అందజేసే అంబానీ ఫ్యామీలి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి