iDreamPost
android-app
ios-app

World Cup: అది మర్చిపోయి బ్యాటింగ్‌కు దిగిన బ్యాటర్‌! నవ్వులు తెప్పిస్తున్న వీడియో

  • Published Oct 07, 2023 | 3:46 PMUpdated Oct 07, 2023 | 3:49 PM
  • Published Oct 07, 2023 | 3:46 PMUpdated Oct 07, 2023 | 3:49 PM
World Cup: అది మర్చిపోయి బ్యాటింగ్‌కు దిగిన బ్యాటర్‌! నవ్వులు తెప్పిస్తున్న వీడియో

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌-ఆఫ్ఠానిస్థాన్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆ ఫన్నీ సంఘంటన చోటు చేసుకుంది. ఆఫ్ఘానిస్థాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో.. ఇన్నింగ్స్‌ 33వ ఓవర్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. రషీద్‌ ఖాన్‌ అవుటైన తర్వాత మరో స్పిన్నర్‌ ముజీబ్‌ ఆర్‌ రహీమ్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. వచ్చి మెహదీ హసన్‌ బౌలింగ్‌లో ఒక బాల్‌ కూడా ఆడేశాడు. కానీ, ఆ తర్వాత అతనికి సడెన్‌గా ఓ విషయం అర్థమైంది. అదేంటంటే.. అతను గాడ్‌ పెట్టుకోలేదు. దీంతో అతని పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంతసేపు తాను గాడ్‌ లేకుండా ఆడుతున్నానా? అనే విషయం అతనికి తెలిసిన తర్వాత ఉలిక్కిపడ్డాడు.

వెంటనే డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు సైగలు చేశాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లోని ఆటగాడు వెంటన్‌ గాడ్‌తో పరిగెత్తుకుంటూ గ్రౌండ్‌లోకి వచ్చాడు. అయితే.. ఆట ఎందుకు ఆగిందో తెలిసిన తర్వాత గ్రౌండ్‌లోని బంగ్లాదేశ్‌ ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు సైతం ఘోల్లుగా నవ్వారు. ఈ ఫన్నీ సంఘటనతో ముజీబ్‌ సైతం ముసిముసి నవ్వులు చిందిస్తూ.. గాడ్‌ ధరించాడు. అయితే.. గాడ్‌ పెట్టుకున్న తర్వాత అతను ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేదు. కేవలం 4 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. అయితే.. ముజీబ్‌ ఆదమరిచి.. గాడ్‌ ధరించడం మర్చిపోయాడు. అయితే.. తాను గాడ్‌ లేకుండా స్పిన్నర్‌ను ఎదుర్కొవడంతో సరిపోయింది.. పేసర్లను ఎదుర్కొని, అనుకోకుండా తగలరాని చోట తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ పేర్కొంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి ఆఫ్ఘానిస్థాన్‌ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ గుర్బాజ్‌ 47 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 83 పరుగుల వరకు ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘాన్‌ ఆ తర్వాత కుప్పకూలింది. 73 పరుగులకు మిగిలిన 9 వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌, మెహదీ హసన్‌ మిరాజ్‌ మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఆఫ్ఘనిస్థాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడల కూలిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ 21 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ముజీబ్‌ గాడ్‌ మర్చిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ఇదీ చదవంది: రచిన్ రవీంద్ర కోసం IPL ఫ్రాంచైజీల క్యూ! వచ్చే సీజన్​లో ఆ టీమ్​లో?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి