iDreamPost

నిన్న ధోని విధ్వంసమే అంతా చూశారు! కాలికి ఉన్న దీన్ని గమనించారా?

  • Published Apr 01, 2024 | 10:59 AMUpdated Apr 01, 2024 | 1:29 PM

MS Dhoni, DC vs CSK, IPL 2024: ఐపీఎల్‌ 2024లో తొలి సారి ధోని బరిలోకి దిగి.. అదరగొట్టాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు రాని ధోని.. తాను బ్యాట్‌ పట్టి బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించాడు. ఆ ఇన్నింగ్స్‌ వెనుక ఓ బాధ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni, DC vs CSK, IPL 2024: ఐపీఎల్‌ 2024లో తొలి సారి ధోని బరిలోకి దిగి.. అదరగొట్టాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు రాని ధోని.. తాను బ్యాట్‌ పట్టి బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించాడు. ఆ ఇన్నింగ్స్‌ వెనుక ఓ బాధ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 01, 2024 | 10:59 AMUpdated Apr 01, 2024 | 1:29 PM
నిన్న ధోని విధ్వంసమే అంతా చూశారు! కాలికి ఉన్న దీన్ని గమనించారా?

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఇదే తొలి ఓటమి. అయితే.. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడిపోయినా.. ఆ టీమ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తన అభిమాన, ఆరాధ్య క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని చాలా కాలం తర్వాత తన బ్యాట్‌ పవరేంటో చూపించాడు. ఢిల్లీ బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని.. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు చేసి తన విశ్వరూపం చూపించాడు. కానీ, చివరి మ్యాచ్‌ గెలిపించలేకపోయాడు. అప్పటికే రిక్వైర్డ్‌ రన్‌ రేట్‌ బాగా పెరిగిపోవడంతో.. ధోని కూడా ఏం చేయలేకపోయాడు. కానీ, తన శక్తికి మించి మాత్రం పోరాటం చేశాడు.

సీఎస్‌కే టాప్‌ ఆర్డర్‌ విఫలం కావడం, మిడిల్డార్‌ బ్యాటర్లు కాస్త స్లోగా బ్యాటింగ్‌ చేయడంతో.. చివర్లో ధోని విరుచుకుపడినా.. సీఎస్‌కే విజయానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటిన ధోని.. తన వింటేజ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను మళ్లీ చూపించాడు. టీమిండియా ఆడుతున్న సమయంలో కెరీర్‌ ఆరంభంలో ఆడిన షాట్లను మళ్లీ ఇన్నాళ్లు ఆడాడు. వాటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. అలాగే తొలి రెండు మ్యాచ్‌ల్లో ధోని అసలు బ్యాటింగ్‌కే రాలేదు. 6, 7 వికెట్లు పడినా కూడా బ్యాటింగ్‌కు రాకుండా ధోని.. డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే ఉండిపోయాడు. దీంతో ధోని ఎందుకు బ్యాటింగ్‌ చేయడం లేదని చాలా మంది క్రికెట్‌ అభిమానులు నిరాశ పడ్డారు.

Dhoni who showed universal form

దానికి కూడా ఓ కారణం ఉంది. ధోని కాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఢిల్లీతో మ్యాచ్‌ తర్వాత ధోని కాలికి ఏదో పెద్ద బ్యాండ్‌ పెట్టుకుని గ్రౌండ్‌లో కనిపించాడు. అంత నొప్పితో కూడా ధోని ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగి.. అదరగొట్టాడు. ఇక సీఎస్‌కేను గెలిపించి ఉంటే ఇంకా బాగుండేదని అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా.. ధోని మాస్‌ హిట్టింగ్‌ చూసి చాలా కాలమైన క్రికెట్‌ అభిమానులకు ధోని ఓ మంచి ట్రీట్‌ ఇచ్చాడనే చెప్పాలి. ఎంతైన ధోని ఆడితే ఆ కిక్కే వేరు. ప్రపంచంలోనే ది బెస్ట్‌ ఫినిషర్‌గా అప్పట్లో పేరు తెచ్చుకున్న ధోని.. అలాంటి బ్యాటింగ్‌ స్టైల్‌ను, ఆ గ్రేస్‌ను మళ్లీ చూపించాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఏకంగా 231.25 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయడంతో విశేషం. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌ చేసి 191 పరుగులు చేసింది. బదులుగా చెన్నై 171 రన్స్‌ మాత్రమే చేసి 20 రన్స్‌ తేడాతో ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో ధోని ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి