iDreamPost
android-app
ios-app

MS Dhoni: గౌరవం రాదు.. సంపాదించుకోవాలి! ధోని కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

  • Published Feb 10, 2024 | 9:50 AM Updated Updated Feb 10, 2024 | 9:50 AM

ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని.. గౌరవం రాదని, దాన్ని సంపాదించుకోవాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని.. గౌరవం రాదని, దాన్ని సంపాదించుకోవాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

MS Dhoni: గౌరవం రాదు.. సంపాదించుకోవాలి! ధోని కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

మహేంద్రసింగ్ ధోని.. తన ఆటతీరుతో, కెప్టెన్సీతో, క్యారెక్టర్ తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ధోని ఏం మాట్లాడినా.. అది క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడికి సాయం చేసి రుణం తీర్చుకుని వార్తల్లోకి ఎక్కాడు మిస్టర్ కూల్. ప్రస్తుతం రాబోయే ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు ఈ జార్ఖండ్ డైనమైట్. తాజాగా ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని.. గౌరవం రాదని, దాన్ని సంపాదించుకోవాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

మోకాలి సర్జరీ తర్వాత కొంత కాలం విశ్రాంతి తీసుకున్న మహేంద్రసింగ్ ధోని.. ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ మెుదలుపెడుతున్నాడు. ఐపీఎల్ 2024 కోసం సన్నద్ధం అవుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్. ఈ క్రమంలోనే సమయం ఉన్నప్పుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ.. అభిమానులకు విలువైన సలహాలు సూచనలు ఇస్తున్నాడు. ఇటీవలే తన చిన్ననాటి ఫ్రెండ్ కు సాయం చేసి.. అతడి రుణాన్ని తీర్చుకున్నాడు. తాజాగా ముంబైలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు ధోని. ఆ ఈవెంట్ లో అతడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వ్యాఖ్యలు ధోని ఎవరినైనా ఉద్దేశించి అన్నాడా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మహేంద్రసింగ్ ధోని మాట్లాడుతూ..”ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రనా వ్యక్తులకు గౌరవం రాదు. దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి. మన పట్ల అవతల వ్యక్తులు చూపించే విధేయతతోనే గౌరవం వస్తుంది. ఇక్కడ మీరో విషయం గుర్తించుకోవాలి. మాటలు చెప్పే వారికంటే.. చేతల్లో చేసి చూపిస్తేనే మనపై ఇతరులకు, సహచరులకు నమ్మకం పెరుగుతుంది. డ్రస్సింగ్ రూమ్ లో ఇతర ఆటగాళ్లకి, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే.. వారు విధేయతతో ఉండరు. ఇక మనం కూర్చునే కుర్చీ, ర్యాంకుల వల్ల గౌరవం వస్తుందని నేను అనుకోను. చివరిగా నేను చెప్పదలచుకుంది ఒక్కటే.. గౌరవం దానంతట అదే రాదు.. మనం సంపాదించుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు ధోని.

కాగా.. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో.. ధోని ఎవరినైనా ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడా? లేక క్యాజువల్ గానే మాట్లాడాడా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ధోని ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని, అతడు అలాంటి వాడు కాదని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ధోని మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Marizanne Kapp: వీడియో: సఫారీ టీమ్ లో లేడీ మెక్ గ్రాత్! స్వింగ్ చూస్తే కంగుతినాల్సిందే..