iDreamPost

IPL 2024పై బాంబు పేల్చిన ధోని.. అన్నీ బాగుంటేనే అంటూ..

  • Author Soma Sekhar Published - 02:52 PM, Tue - 31 October 23

మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ 2024 సీజన్ ఆడతాడా? లేదా? ఈ ప్రశ్న గత కొంతకాలంగా ఫ్యాన్స్ ను తెగ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు మహేంద్రుడు.

మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ 2024 సీజన్ ఆడతాడా? లేదా? ఈ ప్రశ్న గత కొంతకాలంగా ఫ్యాన్స్ ను తెగ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు మహేంద్రుడు.

  • Author Soma Sekhar Published - 02:52 PM, Tue - 31 October 23
IPL 2024పై బాంబు పేల్చిన ధోని.. అన్నీ బాగుంటేనే అంటూ..

ప్రపంచంలో ఎన్ని క్రికెట్ లీగ్ లు ఉన్నాగానీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు ఉన్న క్రేజే వేరు. ఇప్పటి వరకు 16 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్యాష్ రిచ్ లీగ్.. 17వ ఎడిషన్ కోసం సిద్దమవుతోంది. అయితే ఈ లీగ్ ప్రారంభానికి ముందే.. టోర్నీకి సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ మెగాటోర్నీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ 2024 సీజన్ ఆడతాడా? లేదా? ఈ ప్రశ్న గత కొంతకాలంగా ఫ్యాన్స్ ను తెగ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు మహేంద్రుడు.

చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో ఈ జట్టుకు ఉన్నంత క్రేజ్ మరే జట్టుకు లేదంటే అతిశయోక్తికాదేమో. కాగా.. చెన్నైకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణాం ఒకే ఒక్కడు.. అతడే మహేంద్రసింగ్ ధోని. ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరుగాంచిన ధోని.. 2024 ఐపీఎల్ సీజన్ ఆడతాడా? లేదా? అని అందరి మదిలో మెదిలే ప్రశ్న. ఇటీవలే ధోనికి మోకాలి సర్జరీ జరగడంతో.. ఫ్యాన్స్ లో మరింతగా అనుమానాలు బయలుదేరాయి. ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ధోని తన ఐపీఎల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా ధోని మాట్లాడుతూ..”నా మోకాలికి సర్జరీ చేయించుకున్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇక అంతా బాగుంటే.. నేను ఐపీఎల్ 2024 సీజన్ లోకి బరిలోకి దిగుతాను. అయితే మళ్లీ మోకాలి నొప్పి తిరగబెడితే మాత్రం ఆడియన్స్ తో పాటుగా నేను కూడా స్టేడియంలో కూర్చుని మ్యాచ్ లు చూస్తాను” అంటూ బాంబ్ పేల్చాడు మిస్టర్ కూల్. కాగా.. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా దాదాపు నాలుగు నెలలు సమయం ఉండటంతో.. ధోని ఐపీఎల్ బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే మినీ వేలం పాటను నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం నవంబర్ 15వ తేదీ నాటికి రిటెన్షన్ ప్లేయర్ల వివరాల జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇదే పనుల్లో బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు ఈ జార్ఖండ్ డైనమైట్. మరి ధోని ఐపీఎల్ 2024 సీజన్ బరిలోకి దిగుతాడా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి