iDreamPost

MS Dhoni: పోలీసులకు ధోని ఫిర్యాదు! మాజీ పార్ట్ నర్ అరెస్ట్!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మాజీ బిజినెస్ పార్ట్ నర్ మిహిర్ దివాకర్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మాజీ బిజినెస్ పార్ట్ నర్ మిహిర్ దివాకర్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

MS Dhoni: పోలీసులకు ధోని ఫిర్యాదు! మాజీ పార్ట్ నర్ అరెస్ట్!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన మాజీ బిజినెస్ పార్ట్ నర్ మిహిర్ దివాకర్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా అతడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దివాకర్ జైపూర్ లో స్పోర్ట్స్ అకాడమీ స్థాపించడానికి తన పేరును ఉపయోగించి తనను మోసం చేశాడని ఆ ఫిర్యాదులో ధోని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

జైపూర్ లో స్పోర్ట్స్ అకాడమీలు స్థాపిస్తానని చెప్పి తన పేరును ఉపయోగించుకుని డబ్బులు తీసుకున్నట్లు ధోని తన మాజీ భాగస్వామి మిహిర్ దివాకర్, సౌమ్యాదాస్ పై పై రాంచీ జిల్లా కోర్టులో మూడు నెలల కిందటే ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు జైపూర్ పోలీసులు దివాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. సౌమ్యా దాస్ ఆచూకి ఇంకా తెలియలేదు. దివాకర్ పై ఐపీసీ 406, 420, 467 తో పాటుగా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంఎస్ ధోని క్రికెట్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలకు సంబంధించి అతడు డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ. 15 కోట్ల మేర మోసం చేశాడని ధోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి