ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్ లో వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు అయిన కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను ధోనీ తన స్నేహితులతో కలిసి వీక్షించాడు. కోర్ట్ లో ఓ సాధారణం ప్రేక్షకుడిగా నవ్వులు చిందిస్తూ మ్యాచ్ ను ఆస్వాదించాడు.
ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్ లో వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు అయిన కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను ధోనీ తన స్నేహితులతో కలిసి వీక్షించాడు. కోర్ట్ లో ఓ సాధారణం ప్రేక్షకుడిగా నవ్వులు చిందిస్తూ మ్యాచ్ ను ఆస్వాదించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని యూఎస్ ఓపెన్ లో సందడి చేశాడు. ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్ లో వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు అయిన కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను ధోనీ తన స్నేహితులతో కలిసి వీక్షించాడు. కోర్ట్ లో ఓ సాధారణం ప్రేక్షకుడిగా నవ్వులు చిందిస్తూ మ్యాచ్ ను ఆస్వాదించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తనకు ఇష్టమైన టెన్నిస్ ఆటతో ధోని సేదతీరుతుండటం మనకు తెలిసిన విషయమే. ఇక ఈ మ్యాచ్ లో గుబురు గడ్డంతో కనిపించి సర్ప్రైజ్ చేశాడు మిస్టర్ కూల్.
మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తనకు ఇష్టమైన వ్యాపకాలతో తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ధోనికి టెన్నిస్ ఆటంటే ఎంతిష్టమో మనందరికి తెలిసిందే. కాస్త తీరిక దొరికినా కొద్దిసేపైనా టెన్నిస్ ఆడుతూ సేదతీరుతుంటాడు మిస్టర్ కూల్. అదీకాక ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీలకు వీలు చిక్కినప్పుడల్లా వెళ్తుంటాడు. తాజాగా ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు తన స్నేహితులతో కలిసి వచ్చాడు ధోని. గుబురు గడ్డంతో.. ఈ మ్యాచ్ లో ఓ సాధారణ ప్రేక్షకుడిగా మారి సందడి చేశాడు.
ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్ 6-3,6-2,6-4 తేడాతో 12వ సీడ్ ఆటగాడు అయిన అలెగ్జాండర్ జ్వెరెవ్ ను మట్టికరిపించాడు. ఈ విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు అల్కరాజ్. ఆట మధ్యలో అల్కరాజ్ విశ్రాంతి తీసుకుని కూల్ డ్రింక్స్ తాగుతుండగా.. అతడి వెనుకవైపు సీట్లలో తన స్నేహితులతో కలిసి ముచ్చటిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడంతో.. ధోని ఫ్యాన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. గుబురు గడ్డంతో ధోని భాయ్ భలే ఉన్నాడు అంటూ నెటిజన్స్ కితాబిస్తున్నారు.
The MS Dhoni cameo during the US Open Quarter Finals.pic.twitter.com/Dfys7nafpI
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2023