iDreamPost
android-app
ios-app

MS Dhoni: ఆ వ్యూహమే ధోనికి వరంగా మారింది.. గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published May 02, 2024 | 12:44 PM Updated Updated May 02, 2024 | 12:44 PM

చెన్నై సూపర్ కింగ్స్ అనుసరించే ఆ వ్యూహమే ధోనికి వరంలా మారిందని, అందుకే అలా భారీ షాట్లు కొడుతున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ అనుసరించే ఆ వ్యూహమే ధోనికి వరంలా మారిందని, అందుకే అలా భారీ షాట్లు కొడుతున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

MS Dhoni: ఆ వ్యూహమే ధోనికి వరంగా మారింది.. గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మహేంద్రసింగ్ ధోని.. ఈ ఐపీఎల్ సీజన్ లో ధనాధన్ బ్యాటింగ్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. 42 ఏళ్ల వయసులోనూ భారీ షాట్లు ఆడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. అయితే ధోని ఇలా భారీ షాట్లతో విరుచుకుపడటానికి కారణం ఒకటుందని, చెన్నై సూపర్ కింగ్స్ అనుసరించే ఆ వ్యూహమే ధోనికి వరంలా మారిందని టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ధోనికి వరంలా మారిన ఆ వ్యూహం ఏంటి? తెలుసుకుందాం పదండి.

గౌతమ్ గంభీర్.. ఎప్పుడు విరాట్ కోహ్లీ-ఎంఎస్ ధోనిపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తాడనే పేరుంది. కానీ కొన్ని రోజులుగా గంభీర్ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. కోహ్లీ, ధోనిలతో ఆత్మీయంగా మెలుగుతున్నాడు. వారిపై ప్రశంసలు కూడా కురిపిస్తున్నాడు. ఇక తాము అంటే గిట్టనివారే మా మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వ్యాప్తి చేస్తున్నారని, మా మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని గంభీర్, కోహ్లీలు ఇద్దరూ ఇటీవలే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఎంఎస్ ధోని బ్యాటింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు గంభీర్. సీఎస్కే అనుసరిస్తున్న వ్యూహం ధోనికి వరంలా మారిందని పేర్కొన్నాడు.

“చెన్నై గత రెండు-మూడేళ్లుగా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ధోని 8 నుంచి 10 బంతులు ఎదుర్కొవడమే చెన్నై వ్యూహం. అలా తక్కువ బంతులు ఎదుర్కొంటున్నప్పుడు స్వేచ్ఛగా భారీ షాట్స్ కొట్టొచ్చు. ఇదే ధోనికి వరంలా మారింది. అందుకే అతడు తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు పిండుకుంటున్నాడు. బ్యాటర్ 20 నుంచి 25 బంతులు ఎదుర్కొవాల్సి వస్తే.. అతడిపై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ధోనిపై లేదు. దాంతో స్వేచ్ఛగా షాట్స్ కొడుతూ.. తనకు నచ్చిన శైలిలో ఆడుతున్నాడు” అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఇక ఆటగాళ్ల వైఫల్యం గురించి తనదైన శైలిలో స్పందించాడు గంభీర్. ప్లేయర్ వైఫల్యానికి కారణం అభద్రతా భావమే అని పేర్కొన్నాడు. అభద్రతా భావం వల్లే ప్లేయర్లు విఫలం అవుతుంటారు తప్ప.. సామర్థ్యం లేక కాదని చెప్పుకొచ్చాడు. సామర్థ్యం లేకపోతే.. డొమెస్టిక్ క్రికెట్, జాతీయ జట్టులోకి ఎలా వస్తారని ప్రశ్నించాడు.  డ్రెస్సింగ్ రూమ్ లో ఎంత భద్రతా భావం కలిగిస్తే.. ఆటగాళ్లు అంత గొప్పగా రాణిస్తారని సూచించాడు. సంతోషం కలిగించే డ్రెస్సింగ్ రూమ్ ఉంటే.. విజయాలు సాధించవచ్చని గంభీర్ పేర్కొన్నాడు. మరి గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.