Arjun Suravaram
Arjun Suravaram
సినీరంగం అనేది బయటకు కనిపించే అహ్లదకరంగా ఉండదు. ఇందులో కూడా ఎన్నో కష్టానష్టాలు ఉంటాయి. ముఖ్యంగా నిర్మాతలకు సినిమాలు ఎన్నో అగ్నిపరీక్షలు పెడుతుంటాయి. మూవీ షూటింగ్ ప్రారంభమైంది మొదలు పూర్తై.. థియేటర్లో విడుదలై.. హిట్ టాక్ వచ్చే వరకు నిర్మాతలు పడే టెన్షన్ మాములుగా ఉండదు. ఇలాంటి నేపథ్యంలో పలువురు నిర్మాతలు కూడా అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా ఓ నిర్మాత.. తన సినిమా విడుదల కాలేదని ఆందోళనతో గుండెపోటుకు గురయ్యాడు. తాను నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా విడుదలకు నోచుకోకపోవడంతో నిర్మాత విజయ్ జాగర్లమూడి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రముఖ నిర్మాత విజయ్ జాగర్ల మూడి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. విజయ్ జాగర్లమూడి ‘ఖుధీరామ్ బోస్’ అనే సినిమాను నిర్మించాడు. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పిన్న వయస్కుడు ఖుదీరామ్ బోస్. ఆయన జీవిత కథ ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీలో రూపొందించారు. ఈసినిమాకు విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించగా.. రాకేశ్ జాగర్లమూడి, వివేక్ ఒబేరాయ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతేడాది ఆగష్టులో విడుదల చేశారు.
దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమాను 2022 డిసెంబరు 22న పార్లమెంట్ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అలానే గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లోనూ ఈచిత్రం ప్రదర్శించపడింది. ఈ వేడుకల్లో విజయ్ జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు విశేష స్పందన దక్కింది. అలాంటి చిత్రం థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడాయి. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి.. విజయ్ మానసికంగా కుంగిపోయారు. దేశం కోసం అతి పిన్న వయస్సులో ప్రాణ త్యాగం చేసిన ఖుధీరామ్ బోస్ గురించి ఈ తరానికి తెలియజేయాలనే తన ఆకాంక్ష నేరవేరకపోతుందనే బాధతో ఆస్పత్రి పాలయ్యారు. మరి.. ఇలా స్వాతంత్ర సమరయోధుడి సినిమా ఇంతకాలం విడుదలకు నోచుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గోతులు తీసేవారు.. అందులోనే పడతారు! శ్రుతిహాసన్ను