iDreamPost

తుపాకీతో వచ్చిన దొంగలు.. తరిమికొట్టిన త‌ల్లీకూతుళ్లకి DCP సత్కారం!

DCP Felicitates Mothers and Daughters: దోపిడి కోసం వచ్చిన దొంగలను చితక్కొట్టి ఉరికించిన తల్లీకూతుళ్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

DCP Felicitates Mothers and Daughters: దోపిడి కోసం వచ్చిన దొంగలను చితక్కొట్టి ఉరికించిన తల్లీకూతుళ్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తుపాకీతో వచ్చిన దొంగలు.. తరిమికొట్టిన త‌ల్లీకూతుళ్లకి DCP సత్కారం!

ఈ మధ్య కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. చైన్ స్నాచింగ్, బెదిరింపులు, కిడ్నాప్ ఇలా ఎన్నో రకాలుగా మోసాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ గ్యాంగ్ సృష్టిస్తున్న అలజడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. డబ్బు, నగల కోసం కొన్నిసార్లు మనుషులను చంపుతున్నారు. సాధారణంగా దొంగల వద్ద తుపాకీ, కత్తులు ఇలా మారణాయుధాలను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరిని చుక్కలు చూపించారు తల్లీకూతుళ్లు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లోని బేగంపేట లో నవరతన్ జైన్, అమిత్ మహుత్ దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యహ్నం నవరతన్ ఇంట్లో లేని సమయంలో ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. వారి వద్ద నాటు తపంచా, కత్తులు ఉన్నాయి. ఇంట్లో తల్లీకూతుళ్లను మారణాయుధాలతో బెదిరించారు. దొంగలను చూసి అమిత్ మహుత్ ఆమె కూతురు బాబీ మహుత్ ఏమాత్రం భయపడకుండా వారిని ఎదిరించారు. అయితే దుంగలుల్లో ఒకరు అక్కడే ఉన్న పని మనిషి మెడపై కత్తి పెట్టి వంటింట్లోకి లాక్కెళ్లినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన తల్లీ కూతుళ్లు ఆ దుండగులపై దాడి చేశారు. అమిత్ మహుత్ కిక్ బాక్సింగ్ లో నిష్ణాతురాలు. తన కూతురుని కూడా ఇందులో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.

తల్లీ కూతురు నుంచి దొంగ విడిపించుకొని పారిపోగా.. మరో దొంగను ఇంట్లోనే బంధించారు. దొంగల వద్ద మారణాయుధాలు ఉన్నా ఏమాత్రం భయపడకుండా.. వారిని పట్టుకోవడంలో తల్లీ కూతుళ్లు చూపించిన తెగువపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ దృష్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని స్పందించారు. దొంగలను పట్టుకోవడంలో తల్లీ, కూతురు సాహసం నిజంగా ప్రశంసనీయం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం కాలనీలో ఇద్దరు దొంగలు చోరీయి ప్లాన్ వేశారు. దోపిడికి రెండు రోజుల క్రితం రెక్కీ నిర్వహించి కొరియర్ ఇవ్వాలన్న సాకుతో ఇంట్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే వారి పన్నాగం పసికట్టి తల్లీకూతుళ్లు తగిన బుద్ది చెప్పారు. ఆత్మరక్షణ కోసం వాళ్లు చేసిన ధైర్యం మహిళాలోకానికి ఎంతో ఆదర్శం అని కొనియాడారు. అమిత్ మహుత్ ఇంటికి వెళ్లి తల్లీ కూతుళ్లను సత్కరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి