iDreamPost
android-app
ios-app

ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు..

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నిర్దారణ అయ్యాయి. దాంతో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి మొత్తం 1016 కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. 

శ్రీకాకుళంలో ముగ్గురికి కరోనా పాజిటివ్

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు లేని జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో కూడా కొత్తగా మూడు పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కర్నూలులో అత్యధికంగా 275 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా గుంటూరులో 209 కరోనా కేసులు నిర్దారణ అయ్యాయి. తాజాగా నమోదయిన 61 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 25 కేసులు నిర్దారణ కాగా, కర్నూలు జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు లేని శ్రీకాకుళం జిల్లాలో కూడా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. కాగా ఇప్పటివరకూ కరోనా వైరస్ కారణంగా 31 మంది మృతిచెందారు.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetartemisbetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis