iDreamPost

IND vs ENG: ఇండియాను ఓడించాలంటే.. ఆ ఒక్కడ్ని ఔట్‌ చేయాలి: ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌

  • Published Jan 09, 2024 | 5:49 PMUpdated Jan 10, 2024 | 4:24 PM

మరికొన్ని రోజుల్లో ఇండియా-ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ దిగ్గజ మాజీ క్రికెటర్‌.. ఓ భారత ఆటగాడి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరి అతను ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

మరికొన్ని రోజుల్లో ఇండియా-ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ దిగ్గజ మాజీ క్రికెటర్‌.. ఓ భారత ఆటగాడి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరి అతను ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 09, 2024 | 5:49 PMUpdated Jan 10, 2024 | 4:24 PM
IND vs ENG: ఇండియాను ఓడించాలంటే.. ఆ ఒక్కడ్ని ఔట్‌ చేయాలి: ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌

ఈ నెల 11 నుంచి టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్‌ తో మూడు టీ20 ల సిరీస్‌ ఆడనుంది. ఆ వెంటనే ఇంగ్లండ్‌ తో ఐదు టెస్టుల సిరీస్‌ ను స్వదేశంలో ఆడనుంది. ఆఫ్ఘాన్‌ తో టీ20 సిరీస్‌ ను పక్కనపెడితే.. ఇంగ్లండ్‌ తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌ ఎంతో కీలకం కానుంది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ 2025 ఫైనల్‌ ఆడాలంటే.. ఇంగ్లండ్‌ తో టెస్ట్‌ సిరీస్‌ లో టీమిండియా మంచి ప్రదర్శన చేయాలి. ఇప్పటికే 2021, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడిన టీమిండియా.. తొలి సీజన్‌ లో న్యూజిలాండ్‌ చేతిలో, రెండో సారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. కానీ, మూడోసారి మాత్రం డబ్ల్యూటీసీ టైటిల్‌ ను మిస్‌ చేయకూడదని రోహిత్‌ సేన పట్టుదలతో ఉంది. 

అందుకే ఇంగ్లండ్‌ తో టెస్ట్‌ సిరీస్‌ పై చాలా ఫోకస్‌ పెట్టింది. మనలాగే.. ఇంగ్లండ్‌ సైతం టెస్ట్‌ సిరీస్‌ ను చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇండియాలో ఇండియాపై ఎలాగైనా టెస్ట్‌ సిరీస్‌ కైవసం చేసుకోవాలన్న కసి ఇంగ్లీష్‌ టీమ్‌ లో కూడా ఉంది. అందుకే.. ఈసారి చాలా గట్టి టీమ్‌ తో ఇండియాలో అడుగుపెడుతుంది ఇంగ్లండ్‌. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ ఇంగ్లండ్‌ టీమ్‌ కు ఒక వార్నింగ్‌ ఇచ్చాడు. ఇండియాలో ఇండియాపై టెస్ట్‌ సిరీస్‌ గెలవాలంటే.. కచ్చితంగా ఒక ప్లేయర్‌ ను త్వరగా అవుట్‌ చేయాలని, అప్పుడు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నాడు. ఇంతకీ పనేసర్‌ చెప్పింది ఎవరి పేరో తెలుసా.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. పనేసర్‌ సైతం భారత సంతతికి చెందిన వాడే.

టెస్ట్‌ క్రికెట్‌లో అందులోనా ఇండియాలో జరిగే మ్యాచ్‌ లో రోహిత్‌ శర్మ ఎంత డేంజరస్‌ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పవర్‌ హిట్టింగ్‌ ఇంకా లాంగ్‌ ఇన్నింగ్స్‌ లతో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చే సత్తా రోహిత్‌ సొంతం. తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ లో విఫలమైనంత మాత్రనా రోహిత్‌ సత్తా తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. అందుకే పనేసర్‌ కూడా తన టీమ్‌ కే రోహిత్‌ గురించి హెచ్చరికలు జారీ చేశాడు. రోహిత్‌ ఒక్కడు నిలబడినా.. టీమిండియా భారీ స్కోర్‌ ఖాయమనే విషయం పనేసర్‌ కు బాగా తెలుసు. అందుకే ఇండియాను ఓడించాలంటే.. ముందుగా రోహిత్‌ శర్మను అవుట్‌ చేయాలని చెప్పాడు. మరి రోహిత్‌ గురించి పనేసర్‌ ఇంగ్లండ్‌ టీమ్‌ కు వార్నింగ్‌ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి