iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. యువ నటి మృతి

ఈ నెలలోనే అనేక మంది సినీ సెలబ్రీలు మరణించారు. మాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి మరణ వార్త మరిచిపోక ముందే.. సీఐడీ సీరియల్లో నవ్వులు పువ్వులు పూయించిన దినేష్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. తాజాగా..

ఈ నెలలోనే అనేక మంది సినీ సెలబ్రీలు మరణించారు. మాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి సుబ్బలక్ష్మి మరణ వార్త మరిచిపోక ముందే.. సీఐడీ సీరియల్లో నవ్వులు పువ్వులు పూయించిన దినేష్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. తాజాగా..

ఇండస్ట్రీలో విషాదం.. యువ నటి మృతి

సినీ ఇండస్ట్రీని విషాదాలు వీడటం లేదు. వరుసగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ నెల మొదలై పది రోజులు కూడా గడవకముందే పలు పరిశ్రమలకు చెందిన వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ నటి, ఏ మాయ చేశావే మూవీలో కనిపించే బామ్మ సుబ్బలక్ష్మి వయో సంబంధింత సమస్యలతో 87 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ఆ తర్వాత బాలీవుడ్ సీరియల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన సీఐడీ సీరియల్లో మనల్ని ఆద్యంతం నవ్వించిన దినేష్ ఫడ్నిస్ డిసెంబర్ 4న కన్నుమూశారు. అలాగే బాలీవుడ్ నటుడు జూనియర్ మహమూద్ (నయూం సయ్యద్) క్యాన్సర్‌తో మరణించిన సంగతి విదితమే. ఇప్పుడు మరో వర్ధమాన నటి ఇక లేరన్న వార్త వచ్చింది.

ప్రముఖ మలయాళ నటి లక్ష్మిక సజీవన్ మరణించారు. గుండె పోటుతో ఆమె మరణించింది. ఆమె మరణ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. చాలా చిన్న వయస్సులో అంటే 24 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమె షార్జాలో మృతి చెందినట్లు తెలుస్తోంది. అజు అజీష్ దర్శకత్వం వహించిన కాక్క షార్ట్ ఫిల్మ్ లో పంచమిగా కనిపించి మెప్పించింది. దుల్కర్ సల్మాన్ మూవీ ఒరు యమందన్ ప్రేమకథ, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, బ్లాగ్, కుట్టునాదన్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్న సమయంలో ఆమె గుండెపోటుతో మరణించిందని తెలిసి మాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇటీవల కాలంలో గుండెపోటుతో చిన్న వయస్సులో అనేక మంది మరణించారు. 30 ఏళ్లు కూడా నిండని వారు హార్ట్ ఎటాక్ బారిన పడటంపై కారణాలేమని అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి