iDreamPost

షమి మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.. తనను చంపాలని చూస్తున్నారంటూ..!

  • Published Mar 22, 2024 | 8:02 AMUpdated Mar 22, 2024 | 8:02 AM

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి మాజీ భార్య మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వాళ్లు తనను చంపాలని చూస్తున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి మాజీ భార్య మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వాళ్లు తనను చంపాలని చూస్తున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

  • Published Mar 22, 2024 | 8:02 AMUpdated Mar 22, 2024 | 8:02 AM
షమి మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.. తనను చంపాలని చూస్తున్నారంటూ..!

ఐపీఎల్-2024 జాతర శుక్రవారం నుంచి మొదలుకానుంది. డొమెస్టిక్ ప్లేయర్స్ నుంచి ఫారెన్ స్టార్స్ వరకు అందరూ ఈ మెగా లీగ్​లో ఆడేందుకు రెడీ అయిపోయారు. అయితే టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి మాత్రం ఈసారి క్యాష్ రిచ్ లీగ్​కు దూరమయ్యాడు. వన్డే వరల్డ్ కప్-2023 టైమ్​లో గాయపడిన షమి.. దేశం కోసం ఇంజక్షన్లు తీసుకొని మెగా టోర్నీ మొత్తం కంటిన్యూ అయ్యాడు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఎన్​ఏసీలో ఉంటూ అతడు ట్రీట్​మెంట్ తీసుకున్నా కోలుకోలేదు. దీంతో ఇటీవలే విదేశాలకు వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. షమి పూర్తిగా రికవర్ అయ్యేందుకు మరో ఆరు నెలలు పట్టొచ్చని తెలుస్తోంది. ఈ తరుణంలో అతడి మాజీ భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. తనను వాళ్లు చంపాలని చూస్తున్నారని చెప్పింది.

షమి తనను హత్య చేయాలని చూస్తున్నాడని హసిన్ జహాన్ ఆరోపించింది. మర్డర్ చేసేందుకు ఇప్పటికే అతడు ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నన్ను మర్డర్ చేసేందుకు షమి ప్లాన్ చేస్తున్నాడు. ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు, బీజేపీ సర్కారు సాయంతో అతడు ఈ పథకాన్ని రచిస్తున్నాడు. నాకు ఇప్పటిదాకా పూర్తి న్యాయం జరగలేదు. సుప్రీం కోర్టుకు వెళ్తే కేసును వాయిదా మీద వాయిదా వేస్తూ తిప్పిస్తున్నారు. హైకోర్టులో నా గోడు వినేవారే లేరు. కొందరు చేస్తున్న కుట్రల వల్ల నా కేసును హైకోర్టులో లిస్టింగ్​లోకి కూడా తీసుకోవట్లేదు’ అని హసిన్ జహాన్ చెప్పుకొచ్చింది. షమి మాజీ భార్య కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, షమీతో జహాన్ మ్యారేజ్ 2014లో అయ్యింది. వీళ్లకు 2015లో ఒక కూతురు జన్మించింది.

Shami wife shocking comments

పెళ్లయిన కొన్నేళ్ల వరకు షమి-జహాన్ జంట సంతోషంగానే ఉన్నారు. షమితో కలసి పలు క్రికెట్ ఈవెంట్స్​లో జహాన్​ అటెంట్ అయ్యేది. వీళ్లను చూసి సూపర్బ్ కపుల్ అంటూ అందరూ మెచ్చుకున్నారు. అయితే 2018లో వరకట్నం సహా పలు అంశాల్లో షమితో పాటు అతడి కుటుంబం తనను వేధిస్తోందంటూ కేసు పెట్టింది జహాన్. అప్పటి నుంచి వీళ్లిద్దరూ సెపరేట్​గా ఉంటున్నారు. గృహహింస కేసు కింద రీసెంట్​గా తీర్పును వెలువరించిన కోల్​కతా కోర్టు.. హసిన్​కు ప్రతి నెలా 1.30 లక్షలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది. ఆ తర్వాత షమి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తన కూతురు ఐరాను బాగా మిస్సవుతున్నానని చెప్పాడు. దీనంతటికీ హసిన్ కారణమని అన్నాడు. ఐరాను చూసేందుకు ఎంత ప్రయత్నించినా.. తనకు కావాలనే బిడ్డను చూపించడం లేదని షమి ఆవేదన వ్యక్తం చేశాడు. మరి.. షమి-జహాన్ వ్యవహారంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPLకు ముందే రింకూ ఊచకోత! రూ.24 కోట్లు స్టార్క్ కి చుక్కలు చూపించాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి