iDreamPost

ఇకపై ఆన్ లైన్ లో ఇంటికే మద్యం! MLC జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

  • Author Soma Sekhar Published - 10:14 AM, Wed - 23 August 23
  • Author Soma Sekhar Published - 10:14 AM, Wed - 23 August 23
ఇకపై ఆన్ లైన్ లో ఇంటికే మద్యం! MLC జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

నేటి ఆధునిక సమాజంలో ఏది కావాలన్న క్షణాల్లో ఆన్ లైన్ లో వచ్చేస్తుంది. ఈ కామర్స్ సంస్థలు అయిన స్విగ్గీ, జోమాటోలు ఆన్ లైన్ లో క్షణాల్లో ఫుడ్ ను డెలివరీ చేస్తున్న సంగతి తెసిందే. ఇదే మాదిరిగా రానున్న రోజుల్లో ఇంటికే మద్యం తెచ్చే విధంగా తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి సౌకర్యం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన ఎద్దేవ చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసలుగా చేసే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ సర్కార్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రాబోయే రోజుల్లో స్విగ్గీ, జోమాటోలాగే ఆన్ లైన్ లో ఇంటికే మద్యాన్ని తీసుకొచ్చే పథకాన్ని కూడా కేసీఆర్ తీసుకొస్తారని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. భారతదేశంలో ఇలాంటి సౌకర్యాన్ని కల్పించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన ఎద్దేవ చేశారు. తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసలుగా చేయోద్దని జీవన్ రెడ్డి విన్నవించారు.

కాగా.. ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే మార్గాలు చూడాలి గానీ.. ఇలా మద్యం టెండర్లపై రాబట్టడం విడ్డూరంగా ఉందని జీవన్ రెడ్డి సెటైర్లు విసిరాడు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఊరికో బెల్టు షాప్ పెట్టిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. తాజాగా జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మరి తెలంగాణ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్‌.. రానున్న 5 రోజులు వర్షాలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి