iDreamPost
android-app
ios-app

TDP ఐటీ విభాగానికి మాజీ మంత్రి అనిల్ మాస్ వార్నింగ్!

TDP ఐటీ విభాగానికి మాజీ మంత్రి అనిల్ మాస్ వార్నింగ్!

మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ లో ఫైర్ బ్రాండ్ లుగా  గుర్తింపు పొందిన వారిలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. వైసీపీ జోలికి వస్తే ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే.. వాళ్లపై  మాటల దాడి చేయడంలో అనిల్ వెనుకడుగు వెయ్యరు. ఇక సీఎ జగన్ ను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోడు. తాజాగా మరోసారి అనీల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. మహిళపై తప్పుడు పోస్టులు పెట్టారంటూ టీడీపీ ఐటీ విభాగానికి మాజీ మంత్రి అనిల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మాస్ వార్నింగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

మంగళవారం నెల్లూరు టౌన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భా ఐ-టీడీపీ వారికి  ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. అనిల్ విశ్వరూపం చూసిన వారు షాకి గురయ్యారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ల మీద పోస్టులు పెట్టడం కాదనని, దమ్ముంటే తమతో పోరాడమని టీడీపీ నేతలను హెచ్చరించాడు. ఇక తీవ్ర పదజాలంతో అయినా ఫేక్ ఐడీలతో కాకుండా ఈ రాష్ట్రంలో నేను పెట్టానురా పోస్ట్ అని చెప్పుకోడిరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు మగాళ్లు  అయితే పోట్లాడుకుందాం. ఇంట్లో ఆడాళ్లు ఏం చేశారు అంటూ అనిల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయారు. ఆడవాళ్ల జోలికి వస్తే.. చర్మ ఒలిచేస్తారా అంటూ ఘాటుగా హెచ్చరించారు.

ఇలాంటి భాషను తాను రాజకీయాల్లోకి వచ్చాకా చాలా తక్కువగా మాట్లాడానని తెలిపారు.మీకు దమ్ముంటే రాజకీయాల్లో మాట్లాడాలంటే మేము ఉన్నాం, జగనన్న ఉన్నారని తెలిపాడు. ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ల మీద పోస్టులు పెడితే తప్పేనని, మహిళు ఏం చేశారని వారిపై పోస్టులు పెట్టేదంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో మేము ఉన్నందుకు మా భార్యలు, బిడ్డల మీద మాట్లాడుతారా? చేత్త నాయాలారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ఫేక్ ఐడీలతో పెట్టడం కాదురా దమ్ము ఉంటే.. నేను పెట్టాను ఈ పోస్ట్ అని చెప్పి నెల్లూరులో తిరగరండి ఎవరైనా.. అంటూ అనిల్ కుమార్ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం మాజీ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Jojobet GirişmeritbetjojobetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş