iDreamPost

2024లో బీసీ అభ్యర్థి చేతిలో లోకేశ్ ఓడిపోతారు: RK

Alla Ramakrishna Reddy, YSRCP: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి తన సొంతగూటికి చేరుకున్నారు. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి తిరిగి పార్టీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Alla Ramakrishna Reddy, YSRCP: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి తన సొంతగూటికి చేరుకున్నారు. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి తిరిగి పార్టీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2024లో బీసీ అభ్యర్థి చేతిలో లోకేశ్ ఓడిపోతారు: RK

ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. సీనియర్ నాయకులు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సొంతగూటికి చేరారు. కొంతకాలం క్రితం రామకృష్ణారెడ్డి  వైఎస్సార్ సీపీ పార్టీని వీడి.. కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆర్కే సీఎం జగన్ ను కలిశారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను ఆర్కే కలిశారు. అలానే సీఎం జగన్..మంగళగిరి నియోజవర్గ వైసీపీ గెలుపు బాధ్యతలను  రామకృష్ణారెడ్డికి అప్పగించారు.  సీఎం జగన్ ను కలిసిన అనంతరం  రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

మంగళవార ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తాడేపల్లిలోని సీఎంవో క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి..వైఎస్సార్ సీపీ పార్టీలో చేరారు. సీఎం జగన్ ను కలిసిన అనంతరం బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు. “కొన్నికారణాలతోనే పార్టీ నుంచి నేను బయటకు వెళ్లాను. అది కూడా కొంతమంది అధికారుల కారణంగా పార్టీని వీడాను. నేను బయటకు వెళ్లిన తరువాతే అసలు  ఎందుకు ఇలా జరిగిందని పునరాలోచన చేసుకున్నాను. వాస్తవాలు తెలుసుకున్న తరువాత తిరిగి నేను ముఖ్యమంత్రి జగన్ వద్దకు రావాలని నిర్ణయించుకున్నాను. నాకు ఎక్కడ సీటు ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్టీ  విజయం కోసమే పని చేస్తాను. 2019లో నారా లోకేశ్ ఓసీ చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో బీసీ చేతిలో ఓడిపోనున్నారు. 175 కి 175 స్థానాల్లో  వైఎస్సార్ సీపీ విజయం సాధించాలి. సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి సీటును బీసీకి ఇస్తామన్నారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కోసం కృషి చేస్తా. మళ్లీ మంగళగిరిలో నారా లోకేశ్ ను ఓడించేందుకు శాయశక్తుల కృషి చేస్తాను” అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఎలాంటి షరతులు లేకుండానే రామకృష్ణారెడ్డి వైఎస్సార్ సీపీలోకి  చేరినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు కొన్ని నియోజవర్గాల గెలుపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆయన మంగళగిరి నియోజవర్గానికి నాన్ లోకల్ అయినప్పటికి ఇక్కడ తనకంటూ సొంత కేడర్ ను పెద్ద ఎత్తునా ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు  రైతులు ఎన్నోఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి భూములు లాకుంటున్న సమయంలో వారికి ఆర్కే అండగా నిలబడ్డారు. కోర్టు దాక వెళ్లి వారి భూములు కాపాడిన పరిస్థితి మనందరికి తెలిసిందే. అలా రాజధాని ప్రాంతంలో ఎంతో మంది  రైతులు రోడ్డున పడకుండా రామకృష్ణారెడ్డి అండగా నిలిచారు. మరి.. తాజాగా మీడియ ముందు ఆర్కే చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి