iDreamPost
android-app
ios-app

టాలీవుడ్‌లో విషాదం.. మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత!

  • Published Jul 19, 2023 | 8:51 AM Updated Updated Jul 19, 2023 | 8:55 AM
  • Published Jul 19, 2023 | 8:51 AMUpdated Jul 19, 2023 | 8:55 AM
టాలీవుడ్‌లో విషాదం.. మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత!

సినీ పరిశ్రమను విషాదాలు వదలడం లేదు. ప్రతి నెలలో సినీ రంగానికి చెందిన ప్రముఖులు కన్నుమూస్తూ.. అభిమానులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే కొందరు సెలబ్రిటీలు ఆత్మహత్య చేసుకుని.. అందమైన నిండు నూరేళ్ల జీవితాన్ని ముగిస్తున్నారు. మరి కొందరు అనారోగ్యం, ప్రమాదాల కారణంగా కాలం చేస్తున్నారు. ఇక చాలా మంది గుండెపోటు కారణంగా మృతి చెందుతోన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తనికెళ్ల భరణి దర్శకత్వంలో తెరకెక్కిన మిథునం సినిమా గుర్తింది కదా.. ఆ మూవీ కథా రచయిత అయిన శ్రీమరణ తుది శ్వాస విడిచారు. బుధవారం ఉదయం 5 గంటలకు ఆయన మృతి చెందారు.

శ్రీరమణ స్వస్థలం గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపూరం అగ్రహారం గ్రామం. సాహితి ప్రపంచంలో కథకుడు, వ్యంగ్య వ్యాస రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో బాపు-రమణ వంటి దిగ్గజాలతో కలిసి పని చేశారు. అంతేకాక పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో సేవలందించారు. అంతేకాక ఆయన పత్రిక అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా వ్యవహరించారు. అలానే హాస్యరచన విభాగంలో శ్రీరమణ చేసిన కృషికి గాను.. తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు. నవ్య వార పత్రికకు ఎడిటర్‌గా కూడా పని చేశారు. ఇక 1976లో శ్రీరమణకు వివాహం జరిగింది. వారికి ఇద్దరు అబ్బాయిలు సంతానం ఉన్నారు. వారు చైత్ర, వంశీకృష్ణ. వారి పిల్లల బాల్యం అంతా బాపు గారింట్లోనే గడిచింది.

శ్రీమరణ రచనలోల​ ఎక్కువ ప్రఖ్యాతి గాంచిన రచన మిథునం. దీన్ని ఆధారంగా చేసుకుని.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీనియర్‌ నటి లక్ష్మి ప్రధాన పాత్రలో మిథునం సినిమా తెరకెక్కించారు. మలి వయసులో ఉన్న ఓ వృద్ధ జంట జీవిత ప్రయాణాన్ని, వారి మధ్య ఉండే ప్రేమానురాగాలను ఎంతో హృద్యంగా మనసుకు హత్తుకునేలా తెరకెక్కించిన ఈ చిత్రం.. ప్రేక్షకుల మదిని గెలిచింది. తెర మీద కేవలం రెండు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. కానీ వారి మాటల్లో ఊరిలోని జనాలు, ఎక్కడో విదేశాల్లో ఉన్న పిల్లలు, బంధువులు వచ్చి ప్రేక్షకులను పలకరిస్తారు. సినిమాలో ఆయా పాత్రలను మనం చూడకపోయినా.. మనసు వారిని ఫీలవుతుంది. అంతలా మాయ చేశారు దర్శకుడు. అలానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 50 రోజులు ఆడింది. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ఇద్దరు తమ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమా కథా రచయిత శ్రీ రమణ. ఆయన రచనల్లో ది బెస్ట్ సెల్లర్ తెలుగు నవల ఆధారంగా అదే పేరుతో, తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆస్కార్‌ అవార్డుకు సైతం నామినేట్‌ అయ్యింది. నంది అవార్డు కూడా అందుకుంది.