SNP
Mitchell Starc, T20 World Cup 2024, AUS vs BAN: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దాంతో.. టీమిండియాలో ఒక రకమైన భయం మొదలైంది. ఆ భయం ఏంటి? ఆ బౌలర్ ఎవరు ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
Mitchell Starc, T20 World Cup 2024, AUS vs BAN: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దాంతో.. టీమిండియాలో ఒక రకమైన భయం మొదలైంది. ఆ భయం ఏంటి? ఆ బౌలర్ ఎవరు ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సూపర్ 8లో తొలి మ్యాచ్ విజయంతో ఆసీస్ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఓ అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే, టీ20 వరల్డ్ కప్స్‌లో కలిసి అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అన్ని వరల్డ్ కప్స్ కలిపి స్టార్క్ 95 వికెట్లు పడగొట్టాడు. గతంలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ లసిత్ మలింగా పేరిట ఉన్న రికార్డును స్టార్క్ చెరిపేసి.. టాప్ ప్లేస్‌లోకి వచ్చేశాడు. మలింగా టీ20, వన్డే వరల్డ్ కప్పుల్లో మొత్తం కలిపి 94 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడా నంబర్‌ను స్టార్క్ దాటేశాడు.
స్టార్క్‌కు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో 30 వికెట్లు ఉన్నాయి. అలాగే వన్డే వరల్డ్ కప్స్‌లో మొత్తం కలిపి 65 వికెట్లు ఉన్నాయి. అలాగే మలింగాకు టీ20 వరల్డ్ కప్ టోర్నల్లో 38, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో 56 వికెట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా మలింగాను దాటేసినా.. టీ20 వరల్డ్ కప్ ఒక్కటి చూసుకుంటే.. ఇంకా 8 వికెట్లు వెనుకబడే ఉన్నాడు. ఇలా టీ20, వన్డే వరల్డ్ కప్స్ విడివిడిగా చూసుకుంటే.. వన్డే వరల్డ్ కప్స్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ 71 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్ టోర్నీల విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 49 వికెట్లతో నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నాడు. స్టార్క్ రెండు ఫార్మాట్ వరల్డ్ కప్స్‌లో టాప్ ప్లస్‌లో లేకపోయినా.. రెండు కలిపితే మాత్రం నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నాడు.
టీమిండియాలో ఎందుకు భయం..?
ప్రస్తుతం స్టార్క్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తూ.. టీమిండియాకే ఎక్కువ డేంజర్ ఉండేలా కనిపిస్తోంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే ఆల్‌మోస్ట్ సెమీస్‌కు చేరిపోయినట్లే.. ఆస్ట్రేలియాతో జరిగే చివరి సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా ఓడినా పర్లేదు. ఆసీస్, ఇండియా సెమీస్‌కు వెళ్తాయి. ఒక వేళ సెమీస్‌లోనూ ఈ రెండు టీమ్స్ గెలిచి ఫైనల్ చేరితేనే అసలు సమస్య. టీమిండియాలోని సీనియర్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల వీక్‌నెస్ ఉంది. ఫైనల్ మ్యాచ్ అనగానే ఆసీస్ ప్లేయర్లు రెచ్చిపోయి ఆడతారు. వారిలో ఒకడైన స్టార్క్ కూడా అంతే నిప్పులు చెరుగుతాడు. అలాంటి బౌలర్ ఇలా ఫామ్‌లోకి వచ్చి, రికార్డులు సాధిస్తూ ఉంటే.. టీమిండియా క్రికెట్ అభిమానులు కంగారుపడుతున్నారు. మరి స్టార్క్ వరల్డ్ రికార్డ్ సాధించడంతో పాటు టీమిండియాకు ఉన్న ముప్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Starc Supreme ⚡️
Details: https://t.co/QxJtsZHo8W pic.twitter.com/Y1IFJYP5Ni
— cricket.com.au (@cricketcomau) June 21, 2024