iDreamPost

పరిశ్రమలో విభేదాలు అపార్థాలు

పరిశ్రమలో విభేదాలు అపార్థాలు

పరిశ్రమలో విభేదాలు, అపార్థాలు మాములే. కొన్ని తక్కువ గ్యాప్ లో సమిసిపోతే మరికొన్ని ఏళ్ళ తరబడి సాగుతూనే ఉంటాయి. కృష్ణ తనకు ఇష్టం లేకపోయినా అల్లూరి సీతారామరాజు తీశాడని కొన్నాళ్ళు అలక బూనిన ఎన్టీఆర్ ఆ తర్వాత అదంతా మర్చిపోయి మళ్ళీ దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు వగలమారి భర్తలు లాంటి సినిమాలు కలిసి చేశారు. కాల్ షీట్ కు సంబంధించి గిరిబాబు కెరీర్ ప్రారంభంలో ఆయన మీద ఆగ్రహించిన సూపర్ స్టార్ కృష్ణ కొన్నేళ్లు అయ్యాక క్షమించేసి తన బ్యానర్ లో తీసిన ప్రతి చిత్రంలోనూ అవకాశం ఇచ్చారు. ఎస్పి బాలసుబ్రమణ్యంతో వచ్చిన అపార్థం కూడా ఆయన ఇలాగే సమిసిపోయేలా చేసుకున్నారు.

బాలీవుడ్ దిగ్గజ నటులు దిలీప్ కుమార్ రాజ్ కుమార్ లు 1959లో పైగం సినిమాలో కలిసి నటించారు. ఒక సీన్ లో రాజ్ కుమార్ నిజంగానే దిలీప్ సాహెబ్ ని అనుకోకుండా గట్టిగా కొట్టడంతో మాటా మాటా పెరిగి ఇద్దరు 30 ఏళ్ళకు పైగా కలిసి సినిమా చేయలేదు. తిరిగి 1992లో సుభాష్ ఘాయ్ ప్రమేయంతో సౌదాగర్ కోసం చేతులు కలిపారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇదే తరహాలో దర్శకుడు శంకర్ కు కమెడియన్ వడివేలుకు హింసించే 23వ రాజు పులికేశి సీక్వెల్ సందర్భంలో వివాదం వస్తే ఇప్పటిదాకా అది అలాగే కొనసాగుతోంది. 2018లో వడివేలుని బ్యాన్ చేసే దాకా వెళ్ళింది ఈ వ్యవహారం.

నిజానికి వడివేలుకి పెద్ద బ్రేక్ వచ్చింది శంకర్ సినిమాలతోనే. 1994 దాకా ఏదో ఒక మోస్తరుగా నెట్టుకొస్తున్న ఆ హాస్యనటుడికి ప్రేమికుడులో దక్కిన పాత్ర ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ తర్వాత భారతీయుడు, ఒకే ఒక్కడు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్లలో ఇద్దరూ కలిసి పని చేశారు. కానీ పులికేసి సినిమాకు డేట్లు ఇచ్చే విషయంలో వడివేలు వ్యవహార శైలికి విసిగిపోయిన శంకర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేయడం, నిషేధం విధించడం జరిగిపోయాయి. ఆ తర్వాత వడివేలు మీద ఆ బ్యాన్ ఎత్తేశారు. అది వేరే కథ. ఇటీవలే ఒక కొత్త సినిమా ఓపెనింగ్ లో మళ్ళీ శంకర్ తో ఇంకెప్పటికీ పనిచేయనని వడివేలు చెప్పడం చూస్తే అప్పట్లో మ్యాటర్ చాలా సీరియస్సే

Also Read : స్టూడెంట్ జ్ఞాపకాలు మరోసారి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి