iDreamPost

ఆయన ఏం అడుగుతాడో నాకు బాగా తెలుసు.. వడివేలుపై షకీలా కామెంట్స్!

  • Author singhj Updated - 01:29 PM, Mon - 14 August 23
  • Author singhj Updated - 01:29 PM, Mon - 14 August 23
ఆయన ఏం అడుగుతాడో నాకు బాగా తెలుసు.. వడివేలుపై షకీలా కామెంట్స్!

వడివేలు.. తమిళ చిత్రసీమలో కమెడియన్​గా ఎంతో పేరు గడించిన వారిలో ఒకరు. ఒక సమయంలో ఆయన లేని తమిళ సినిమా లేదు అనే రేంజ్​లో ఉండేది. యువ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి మూవీస్​లో వడివేలు ఉండాల్సిందే. అద్భుతమైన కామెడీ టైమింగ్​తో అంతగా ఆడియెన్స్​ను ఆయన ఉర్రూతలూగించారు. తలైవా రజినీకాంత్ ‘చంద్రముఖి’ సినిమాతో తెలుగు నాట కూడా వడివేలుకు పాపులారిటీ పెరిగింది. అలాంటి ఆయన కొన్ని వివాదాల కారణంగా చాన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యారు. రీఎంట్రీలో ‘మామన్నన్​’తో బిగ్ హిట్ కొట్టారాయన.

ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ‘మామన్నన్​’లో ఫెంటాస్టిక్ యాక్టింగ్​తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు వడివేలు. అలాంటి ఆయనపై గతంలో పలువురు నటులు, నటీమణులు ఆరోపణలు చేశారు. తాజాగా ప్రముఖ నటి షకీలా కూడా ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగానే ఆయన గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం సినీ స్టార్స్​ను ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళ నటి ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేశారు. కెరీర్ ప్రారంభంలో వడివేలుతో పాటు వివేక్, సంతానం లాంటి హాస్య నటుల పక్కన చిన్న చిన్న పాత్రల్లో నటించారు ప్రేమ ప్రియ. అయితే ఆ తర్వాత ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి.

చిత్ర పరిశ్రమలో తన ఎదుగుదలకు వడివేలు అడ్డుకట్ట వేశారని షకీలాతో ఇంటర్వ్యూలో ప్రేమ ప్రియ ఆరోపించారు. తనకు మూవీస్​లో యాక్టింగ్ చేసే ఛాన్సులు వచ్చాయని.. అయితే ఆయన వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయన్నారు. షూటింగ్​కు వెళ్తే తనను చూడగానే ఈ అమ్మాయి వద్దని వడివేలు మూవీ మేకర్స్​తో చెప్పించి వెనక్కి పంపేవారని ప్రేమ ప్రియ తెలిపారు. వడివేలుకు తనకు మధ్య మీ-టూ సమస్య లేదని.. అది వేరే సమస్య అన్నారామె. అయితే తనకు వడివేలు గురించి బాగా తెలుసని షకీలా చెప్పుకొచ్చారు. షూటింగ్​ స్పాట్​లో ఆయన ఎలా ఉంటాడో, ఏం అడుగుతాడో తెలుసునని ఆ ఇంటర్వ్యూలో షకీలా పేర్కొన్నారు. వడివేలు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి