Krishna Kowshik
ఈ సంక్రాంతి సమయంలో టాలీవుడ్ లో ఎంతటి సందడి నెలకొందే.. కోలీవుడ్ నాట కూడా అంతే పోటీ నడిచింది. అక్కడ కూడా పొంగల్ సమయంలో మూడు బడా చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కించిన..
ఈ సంక్రాంతి సమయంలో టాలీవుడ్ లో ఎంతటి సందడి నెలకొందే.. కోలీవుడ్ నాట కూడా అంతే పోటీ నడిచింది. అక్కడ కూడా పొంగల్ సమయంలో మూడు బడా చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కించిన..
Krishna Kowshik
ఈ సంక్రాంతికి తెలుగు నాట ఎంత పోటీ నెలకొందే .. తమిళ నాట కూడా అంతే పోరు నడిచింది. పెద్ద పండుగ సమయంలో మహేష్ గుంటూరు కారం, సజ్జా తేజ హనుమాన్, వెంకీ సైంధవ్, నాగార్జున నా సామి రంగా అంటూ వచ్చారు. ఇందులో హిట్ ఫట్ సంగతి పక్కన పెడితే.. అసలు సిసలైన సినిమా సందడి కనబడింది. వీటితో తోడు తమిళ సినిమాలు రావాలనుకున్నాయి. అయితే.. థియేటర్ల ఇష్యూ వల్ల ఆగిపోయాయి.. కొన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అలాగే పొంగల్ బరిలో కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మూడు బడా సినిమాలు రిలీజ్ అయ్యాయి. శివ కార్తికేయన్ అయలాన్, ధనుష్.. కెప్టెన్ మిల్లర్.. అరుణ్ విజయ్.. మిషన్ చాఫ్టర్ 1.
వీటిల్లో కెప్టెన్ మిల్లర్ మాత్రమే జనవరి 26న తెలుగులో రిలీజ్ అయ్యింది. అయలాన్ నేరుగా కూడా థియేటర్లలోకి ఆలస్యంగా విడుదల కావాల్సి ఉండగా.. ఆ నిర్ణయాన్ని విరమించుకుని.. నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు పోటా పోటీగా డిజిటల్ వైపు దూసుకు వస్తున్నాయి. ఒకే రోజు ఈ రెండు సినిమాలు పలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. ఫిబవ్రవరి 9న సన్ నెక్ట్స్ లో అయలాన్, అమెజాన్ ప్రైమ్‌లో కెప్టెన్ మిల్లర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మిషన్ చాఫ్టర్ 1 కూడా స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. పోటీ లేకుండా నింపాదిగా వారం రోజుల తేడాతో వస్తుంది. ఫిబ్రవరి 16న నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫిషియల్ ఎనౌన్స్ వచ్చింది. ఆ సినిమాలతో పోటీ పడితే.. రీచ్ ఎక్కువ స్థాయిలో ఉండదు కాబట్టి.. వారం రోజుల తర్వాత ఆలస్యంగా స్ట్రీమింగ్ కాబోతుంది.
ఏఎల్ విజయ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది మిషన్ చాప్టర్ 1. అరుణ్ విజయ్, అమీ జాక్సన్, నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా నటించారు. అమీజాక్సన్ చాలా రోజుల తర్వాత కోలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రంలో అరుణ్ విజయ్ కూతురి పాత్రలో కనిపించింది ఇయాల్. లియోలో ఇళయదళపతి విజయ్, త్రిష కూతురిగా నటించింది ఈ పాప. ఈ సినిమాలో ఈ పాపది కీలక రోల్. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చి మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. లైకా ప్రొడక్షన్స్, శ్రీ షిర్డీ సాయి మూవీస్, న్యూ మార్చ్ ఫాస్ట్ పిక్చర్స్, ఆస్పెన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.