iDreamPost

మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా కన్నుమూత!

Rinky Chakma Passed away: త్రిపురకు చెందిన అందాల సుందరి మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడుతూ 29 ఏళ్లకే కన్నుమూసింది.

Rinky Chakma Passed away: త్రిపురకు చెందిన అందాల సుందరి మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడుతూ 29 ఏళ్లకే కన్నుమూసింది.

మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా కన్నుమూత!

మృత్యువు మనిషిన ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు మనతో ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడంతో కుటుంబం సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోతుంటారు. ఈ మద్య ఎక్కువగా క్యాన్సర్, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాక్ ఇలా ఎన్నో రకాలుగా మృత్యువు వెంటాడుతుంది. కొంతమంది జీవితంలో ఎన్నో కలలు కంటారు.. వాటిని సాధించుకునేందుకు అహర్శశలు కష్టపడుతుంటారు.. ఆ కలలు సాధించుకునే లోపే మృత్యు వడిలోకి చేరిపోతారు. అలాంటి ఘటనే త్రిపురలో చోటు చేసుకుది.  త్రిపురకు చెందిన అందాల సుందరి.. మాజీ మిస్ ఇండియా త్రిపుర కన్నుమూసింది. విరాల్లోకి వెళితే..

2017 లో మిస్ ఇండియా త్రిపురగా కీరిటం దక్కించుకున్న అందాల సుందరి రింకీ చక్మా కన్నుమూసింది. గత రెండేళ్లుగా ఆమె క్యాన్సర్ తో పోరాడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. 2022 లో రింకీ చక్మా బ్రెస్ట్ క్యాన్సర్ భారిన పడినప్పటి నుంచి చికిత్స తీసుకుంటుంది. ఈ వ్యాధి ఊపిరితిత్తులు, తలకు వ్యాపించింది. ఫిబ్రవరి 22న ఆమె పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్పించారు. ఆమె చికిత్స కోసం స్నేహితులు, అందాల పోటీ సహచరులు నిధులు సేకరించినట్లు తెలిపారు. రింకీ చక్మా ఎంతో ఆత్మాభిమానం కలిగిన అమ్మాయని.. ఏనాడూ తన అనారోగ్యం గురించి బయటపెట్టలేదని అన్నారు. ఇటీవల తన తాను క్యాన్సర్ భారిన పడినట్లు సుధీర్ఘ పోస్ట్ పెట్టి ఆర్థిక సాయం అడిగారు. అంతలోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు బంధువులు తెలిపారు. ఈ విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ధృవీకరించింది.

గత నెలలో మాజీ మిస్ త్రిపుర తన ఇన్ స్ట్రాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది.. ‘ నాకు మాలిగ్నెంట్ ఫైలోడ్స్ ట్యూమర్ (బ్రెస్ట్ క్యాన్సర్) ఉన్నట్లు నిర్దారణ అయ్యంది.. ఇటీవల నా ఊపిరితిత్తులలోకి, నా తలలోకి (మెదడు కణితి) చేరింది. నాకు బ్రెయిన్ సర్జరీ పెండింగ్ లో ఉంది.. ఈ క్యాన్సర్ నా శరీరంలో చాలా వరకు వ్యాపించింది. 30 శాతం ఆశలు మాత్రమే ఉన్నాయి.. ప్రస్తుతం నాకు కీమో థెరపీ చికిత్స నడుస్తుంది’అంటూ తన బాధను ఫ్యాన్స్ తో పంచుకుంది. 2022 నుంచి రెండేళ్ళ పాటు చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగడంతో చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. అందుకే డొనేషన్స్ ఇవ్వాలని కోరింది. అంతలోనే ఆమె కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది. 2017 లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్ గా నిలిచింది. రింకీ మిస్ బ్యూటీ విత్ పర్పస్ టైటిల్ గెల్చుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Rinky Chakma (@rinkychakma_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి