iDreamPost
android-app
ios-app

బాబు స్కాములపై సభలో చర్చకు వచ్చే దమ్ముందా? బాలకృష్ణకు రోజా సవాల్!

  • Author singhj Published - 09:05 PM, Fri - 22 September 23
  • Author singhj Published - 09:05 PM, Fri - 22 September 23
బాబు స్కాములపై సభలో చర్చకు వచ్చే దమ్ముందా? బాలకృష్ణకు రోజా సవాల్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష నాయకులు దిగజారి ప్రవర్తిస్తూ చిల్లర వేషాలతో సభా మర్యాదను మంటగలుపుతున్నారు. ముఖ్యంగా హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే సినిమాల్లో మాదిరిగా తొడలు కొడుతూ, ఈలలు వేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అసెంబ్లీలో ఉన్నాననే సోయి కూడా లేకుండా ఆయన ప్రవర్తిస్తున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య.. ఏనాడూ ప్రజా సమస్యలపై నోరు విప్పింది లేదు. కానీ తన కుటుంబ సభ్యుడు, బావ చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలు, బాలకృష్ణ ప్రవర్తిస్తున్న తీరుపై మంత్రి ఆర్​కే రోజా మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు సభకు చర్చ కోసం రాలేదని.. రచ్చ చేయడానికే వచ్చారని ఫైర్ అయ్యారు. బాలకృష్ణకు బాబు సీటు మీద మనసు లాగినట్లుందని.. అందుకే బావ కుర్చీ ఎక్కి మరీ విజిల్స్ వేసి పిచ్చి పిచ్చి వేశాలేశాడని రోజా విమర్శించారు. బాలకృష్ణకు రోషం లేదా అని ఆమె ప్రశ్నించారు. తన బావ చంద్రబాబు తప్పు కాదు.. నిప్పు అని ఒప్పుకోవడానికి బాలకృష్ణకు మనసు రావడం లేదా అని క్వశ్చన్ చేశారు.

చంద్రబాబు చేసిన అన్ని స్కాముల మీదా చర్చిద్దామని టీడీపీ నేతలు, బాలకృష్ణకు మంత్రి రోజా సవాల్ విసిరారు. సోమవారం వస్తారో, మంగళవారం వస్తారో.. ఏ వారం వస్తారో మీ ఇష్టం, బాబు స్కాములపై చర్చిద్దామని ఆమె ఛాలెంజ్ చేశారు. సినిమాల్లో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు.. అసెంబ్లీలో తన బావ తప్పు చేయలేదని, ఈడీ ఎంక్వైరీ వేయండని బాలకృష్ణ అడగాలని డిమాండ్ చేశారు. సభకు వచ్చే సీన్ లేనందునే.. ఢిల్లీకి వెళ్లి బహిరంగ చర్చకు రమ్మని లోకేష్ సవాల్ విసురుతున్నాడని మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ నాయకులకు చిన్నమెదడు చితికి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: ‘నిన్ను నమ్మలేం బాబు’.. సీనియర్ జర్నలిస్ట్ రేణుక బయటపెట్టిన నిజాలు!

gamdomCasibommarsbahis girişMarsbahisJojobetJojobet Giriş