iDreamPost

పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు!

పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో రాజకీయం పుల్ హీట్ గా నడుస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీ జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో మంటలు రేపుతున్నాయి. మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్ వ్యవస్థ సేకరించిన సమాచారమే కారణమంటూ పవన్  వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలపై మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రి జోగి రమేశ్, అంబటి రాబాంబు వంటి వారు పవన్ పై ఫైర్ అయ్యారు. తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కూడా పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం మంత్రి  ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.  ఏపీలో మహిళ అదృశ్యంపై ఏ నిఘా సంస్థ పవన్ కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాక పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్కలు తేలాలని ఆమె వ్యాఖ్యనించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..” హెరిటేజ్ లో గంజాయి, నారావారిపల్లెలో ఎర్ర చందనం దొరుకుతోంది. రాష్ట్రంలో  ఇంకెక్కడా కూడా గంజాయి దొరకలేదు. రాయసీమ ద్రోహి  సీఎం జగన్ కాదు. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబే.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత, పరిశీలించే అర్హత లేదు. చంద్రాబాబుకు విజన్ ఉంది..విస్తారాకుల కట్ట ఉందనే వాడు.. ఎందుకు ఐదేళ్ల కాలంలో రాయలసీమలో ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయలేకపోయాడు. చంద్రబాబు రెయిన గన్ తో కొట్టిన పంట.. గంటలోనే మాడిమసైంది. కాబట్టి చంద్రబాబు అనే వాడు.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ముఖ్యంగా రైతులకు ఆయన వస్తేనే భయపడే పరిస్థితి ఉంది. అలాంటి ఈయన ఈ రోజు జగన్ గారి గురించి చెప్తే.. నమ్మే పరిస్థితి లేదు.

జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ అనంతపురమే కాకుండా.. రాయలసీమలో ఎక్కడ ఒక్క కరువు మండలం కూడా లేదు. పుష్కలంగా వర్షాలు వస్తున్నాయి. రైతులందరూ పంటలు పండిచుకుని సంతోషంగా ఉన్నారు. రైతులు ధర్నాలు, రాస్తారోకులు చేయకుండా.. ఆర్బీకేల ద్వారా  అన్ని పరిష్కారాలు చేసుకుంటున్నారు” అని మంత్రి రోజా అన్నారు. మరి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై రోజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏపీ మంత్రి అమర్నాథ్‌‌ను కలిసిన ముద్రగడ పద్మనాభం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి