iDreamPost

అదే చివరి రోజు.. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణపై మంత్రి సంచలన ప్రకటన!

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కాగా దరఖాస్తుల స్వీకరణపై మంత్రి సంచలన ప్రకటన చేశారు. అదే చివరి రోజు అంటూ స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కాగా దరఖాస్తుల స్వీకరణపై మంత్రి సంచలన ప్రకటన చేశారు. అదే చివరి రోజు అంటూ స్పష్టం చేశారు.

అదే చివరి రోజు.. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణపై మంత్రి సంచలన ప్రకటన!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా తలెంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 2023 నుంచి జనవరి 06 2024 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వార్డులు, గ్రామ సభల ద్వారా ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఆరు గ్యారంటీల కోసం ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి. అయితే తాజాగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు.

ప్రజాపాలన దరఖాస్తులు డిసెంబర్ 28 నుంచి ప్రారంభం కాగా 30వ తేదీ వరకు కొనసాగింది. ఆ తర్వాత డిసెంబర్ 31 ఆదివారం కావడం, జనవరి 01 2024 నూతన సంవత్సరం కావడంతో ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియకు బ్రేక్ ఇచ్చింది. రెండు రోజుల సెలవుల అనంతరం మళ్లీ ఈ రోజు(మంగళవారం) ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుల సమర్పించేందుకు జనవరి 6 వరకే తుది గడువు ఉండగా.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులను మండల కేంద్రాల్లో ఇవ్వొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా పాలన దరఖాస్తుల గడువుపై సంచలన ప్రకటన చేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజా పాలన దరఖాస్తులు సమర్పించేందుకు జనవరి 6నే చివరి తేదీ అని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆ తర్వాత పొడిగింపు ఉండదని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఈ ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సీఎం ఒక విధంగా మంత్రుల మరో విధంగా ప్రకటనలు చేస్తుండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. మరి మంత్రి పొన్నం ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు తేదీ పొడిగింపు ఉండదని చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి