iDreamPost

చంద్రబాబు జోలెపై మంత్రి కొడాలి సెటైర్‌.. సభలో నవ్వులు..

చంద్రబాబు జోలెపై మంత్రి కొడాలి సెటైర్‌.. సభలో నవ్వులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ప్రశాంతంగా, సీరియస్‌గా సాగింది. అయితే పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని రంగ ప్రవేశంతో సభలో కొత్త జోష్‌ వచ్చినట్లైంది. తనదైన పంచ్‌ డైలాగ్‌లతో కొడాలి నాని మాట్లాడారు. సభలో నవ్వులు పూయించారు.

ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సభ్యులు ఘొళ్లున నవ్వారు. అమరావతి పరిరక్షణ పేరుతో చంద్రబాబు బస్సు యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో ఆయన అమరావతి ఉద్యమానికి విరాళాలు సేకరించారు. తన మెడకు జోలె కట్టుకుని, రెండు చేతులతో దాన్ని పట్లుకుని విరాళాలు పోగు చేశారు. ఈ అంశంపై కొడాలి నాని సభలో మాట్లాడుతూ.. ‘‘జోలె పట్టుకుని అడుక్కుంటే సానుభూతి రాదు, ఇలా చేస్తే వీడికి ఎంత ఖర్మ పట్టిందిరా..? అడుక్కుంటున్నాడు’’ అని ప్రజలు అనుకుంటారు తప్పా సానుభూతి రాదని కొడాలి సెటైర్‌ వేశారు. దింతో సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ చంద్రబాబు తన పిచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఎక్కించారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తెలంగాణ సెంటిమెంట్‌ లేదని అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ వారు అంటే కేసీఆర్‌ రాజీనామా చేసి పోటీ చేశారని గుర్తు చేశారు. అలాగే అమరావతే రాష్ట్ర ప్రజలందరూ కొరుకుంటుంటే.. టీడీపీ సభ్యులు అందరూ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, అలా వెళ్లి గెలిస్తే ప్రజలందరూ అమరావతే కావాలని కోరుకుంటున్నట్లు తాము అంగీకరిస్తామన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి