iDreamPost

‘పవన్ నన్ను గోకారు’ కాబట్టే మాట్లాడుతున్నాను: అంబటి రాంబాబు

‘పవన్ నన్ను గోకారు’ కాబట్టే మాట్లాడుతున్నాను: అంబటి రాంబాబు

బ్రో సినిమాతో రాజుకున్న రాజకీయ చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమాల్లోకి పాలిటిక్స్ ఎందుకు తీసుకొచ్చారు? సినిమాని సినిమాగా ఎందుకు తీయటం లేదు? అనే ప్రశ్నలపై రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా బ్రో సినిమా ఫండింగ్ విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను బలంగా వినిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత? బ్రో సినిమా పెట్టుబడి ఎంత, ఎలా వచ్చాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తీరాల్సిందేనని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తాజాగా ఢిల్లీ వేదికగా మరోసారి ఈ ప్రశ్నలను పునరుద్ఘాటించారు.

పవన్ కల్యాణ్ నన్ను గోకాడు కాబట్టే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అయినా పవన్ ని విమర్శిస్తే చంద్రబాబుకు ఎందుకు నొప్పి కలుగుతోంది. పవన్ ఎప్పుడూ నిజాయితీ పరుడిని అని చెబుతాడు కదా.. ఎందుకు బ్రో సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అంటే చెప్పడం లేదు. ఆయనే గతంలో చెప్పాడు కదా.. రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటాను అని. పవన్ కల్యాణ్ కు ఎంత రెమ్యూనరేష్ ఇచ్చారు అనే విషయాన్ని బ్రో నిర్మాత అయినా చెప్పాలి. సినిమా పారితోషకం గురించి చెప్పని ఆయన నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు మళ్లీ అధికారం వస్తే.. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానని చెబుతున్నారు. అసలు చంద్రబాబు పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? పోలవరం నా బిడ్డ అంటున్నారు కదా.. నువ్వు కన్నావా?  తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన తప్పుల వల్లే పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరిగింది.

పోలవరం, పులి చింతల ప్రాజెక్టులు ఎవరు ప్రారంభించారు? అసలు చంద్రబాబు రాయలసీమలో ఒక్క ప్రాజెక్టుకు అయినా పునాది వేశారా? లేక పూర్తి చేశారా? చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు. లై డిటెక్టర్ పెట్టినా చంద్రబాబు చెప్పే అబద్ధాలను కనుక్కోలేరు. అసలు ఢిల్లీ ఎందుకు వచ్చారని? ఎవరెవరిని కలిశారంటూ అంబటిని విలేకర్లు ప్రశ్నించారు. అందుకు.. “కొన్ని కొన్ని బహిరంగంగా చెప్పకూడనివి ఉంటాయి. విజయసాయిరెడ్డి, కేంద్రమంత్రి షెకావత్ ని కలిశాను. ఆయన్ను పోలవరం రామని అడిగాను. సాధ్యమైనంత త్వరగా వస్తానన్నారు. వైసీపీ ఎంపీలను కూడా కలిసి మాట్లాడాను. పోలవరం ప్రాజెక్టులో గైడ్ బండ్ కుంగడానికి కారణాలు తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటీ వేశాం. టీడీపీ హయాంలో చేసిన తప్పిదాల వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. డయాఫ్రం వాల్ కొత్తది నిర్మించే యోచన చేస్తున్నారు. రిపేర్లు, కొత్తది కట్టేందుకు దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుంది” అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి