iDreamPost

Mimi Chakraborty: గొప్ప మనస్సు చాటుకున్న MP మిమి చక్రవర్తి

సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కేవలం తమ పనులతో బిజీగా ఉండటమే కాకుండా సామాజిక ధృక్పథం, సేవా తత్పరతను కనబరుస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అనేక మంది నటీనటులు సామాజిక సేవ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు ఓ మహిళా నేత..

సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కేవలం తమ పనులతో బిజీగా ఉండటమే కాకుండా సామాజిక ధృక్పథం, సేవా తత్పరతను కనబరుస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అనేక మంది నటీనటులు సామాజిక సేవ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు ఓ మహిళా నేత..

Mimi Chakraborty: గొప్ప మనస్సు చాటుకున్న MP మిమి చక్రవర్తి

సినిమా నటులు, రాజకీయ నేతలు తమ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ వంతు సాయం చేస్తుంటారు. తమ గొప్ప మనస్సు చాటుకుంటారు. మహేష్ బాబు వంటి స్టార్ నటులు గ్రామాలను దత్తత తీసుకోవడమే కాకుండా.. ఉచితంగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అడవిని అడాప్ట్ చేసుకున్నారు. మంచు లక్ష్మి సైతం 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న సంగతి విదితమే. ఆ బడులకు మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నారు ఆమె. అనేక మంది నటీనటులు తమకు తోచిన సాయం చేసి.. ఆ సంగతి చాలా గుప్తంగా దాస్తుంటారు. తాజాగా ఓ నటి, ఎంపీ తన మంచి మనస్సును చాటుకుంది. ఆమె చేసిన సాయం నిజంగా హ్యాట్సాఫ్ అనిపించకమానదు.

మనుషుల్ని మానసికంగానే కాకుండా శారీరకంగా వేదనకు గురి చేసే వ్యాధి క్షయ. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల మంది క్షయ (టీబీ) బారిన పడుతున్నారు. ఇటువంటి రోగులను దత్తత తీసుకుని, వారికి వైద్యం అందిస్తోంది ఎంపీ, నటి మిమి చక్రవర్తి. మిమి బెంగాలీ యాక్టర్. ఈ ఏడాది 25 మంది రోగులను దత్తత తీసుకుని, తల్లిలా వారికి వైద్యం అందిస్తున్నారు. ఆరు నెలల పాటు వారి సంరక్షణ బాధ్యతలను తీసుకుని.. వ్యాధి నయం అయ్యే వరకు ఆ ఖర్చును ఆమె భరించారు. ఈ సందర్భంగా ఆమె సేవను కొనియాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రశంసా పత్రాన్ని అందించింది. దీన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.

‘ఈ ఏడాది నేను 25 మంది టీబీ పేషంట్లను దత్తత తీసుకుని, చికిత్స అందించా. రాబోయే సంవత్సరంలో మరికొంత మందిని అడాప్ట్ చేసుకుంటాను. నా సేవను కొనియాడుతూ అందించిన ప్రశంసకు ధన్యవాదాలు’అంటూ పేర్కొన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుండి వచ్చిన ప్రశంసా పత్రాన్ని ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఏడాది నినాదం ‘అవును మనం క్షయను అంతం చేయగలం’అన్న దానికి కట్టుబడి.. ఆమె తన సేవ అందించారు. 2012 నుండి బెంగాలీ మూవీస్ లో నటిస్తున్న మిమీ, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుండి జాదవ్ పూర్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆమె చేసిన సేవ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి