iDreamPost

రూ.100 తో తన గ్రామం వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి! హ్యాట్సాఫ్ సార్!

పట్టుదల, శ్రమలకు హద్దులు ఉండవు. కష్టపడటానికి వెనుకాడని వారు జీవితంలో ఎప్పటికైనా విజయం సాధిస్తారు. ఈ మాటలను నిజం చేస్తూ మలయ్‌ దేబ్‌నాథ్‌ యువతకు ఆదర్శంగా నిలిచారు. రూ.100 తో ఊరిని వదలి వెళ్లి.. నేడు 200 కోట్లకు అధిపతిగా మారారు.

పట్టుదల, శ్రమలకు హద్దులు ఉండవు. కష్టపడటానికి వెనుకాడని వారు జీవితంలో ఎప్పటికైనా విజయం సాధిస్తారు. ఈ మాటలను నిజం చేస్తూ మలయ్‌ దేబ్‌నాథ్‌ యువతకు ఆదర్శంగా నిలిచారు. రూ.100 తో ఊరిని వదలి వెళ్లి.. నేడు 200 కోట్లకు అధిపతిగా మారారు.

రూ.100 తో తన గ్రామం వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి! హ్యాట్సాఫ్ సార్!

మనిషికి జీవితంలో ఏదైనాసాధించాలనే కసి ఉంటే చదువు,ఇతర ఆస్తులు వంటి వాటితో సంబంధం లేకుండానే ఉన్నత శిఖరాలను అధిరోహించి.. విజేతగా నిలవచ్చు. గొప్పగా జీవించాలనే కసి, తపన, పట్టుదల ఉంటే..ఏ సమస్యలు మనల్ని ఆపలేవు. సంకల్పమే బలంగా ఉంటే.. ఎన్ని అవరోధాలైనా ఎదుర్కొన్ని విజేతగా నిలబడవచ్చు. అలా ఎందరో కష్టపడి జీవితంలో పైకి వచ్చారు. అలాంటి వారిలో ఒకరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన  మలయ్ దేబ్ నాథ్. కేవలం రూ.100తో ఊరు వదలి వెళ్లి.. నేడు 200కోట్లకు అధిపతిగా మారాడు. మరి..ఆయన సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పశ్చిమ బెంగాల్ లోని కుచ్ బెహార్ జిల్లాలో మలయ్ దేబ్  ఓ చిన్న గ్రామంలో నివాసం ఉండే వాడు. ఆయనకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు వారి కుటుంబ నిర్వహిస్తున్న వ్యాపారం  అగ్నిప్రమాదానికి గురైంది. అయితే ఇలా వారి వ్యాపారం అగ్నిప్రమాదానికి గురికావడానికి ఓ బలమైన కారణం ఉంది.  రాజకీయ కారణంగా వారి వ్యాపారం విషయంలో అలా జరిగింది. ఇక ఈ ఘటన వారి కుటుంబాల్లో పెద్ద విషాదాన్ని నింపింది. వాళ్లు తిరిగి ఆ వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ కోలుకోలేకపోయారు.

దీంతో దేబ్ నాథ్ తన గ్రామంలోనే ఓ టీ స్టాల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించాడు. 12వ తరగతి పూర్తి చేసేవరకు టీ వ్యాపారాన్నే కొనసాగించాడు. అనంతరం ఇక్కడే ఉంటే..తమ జీవితాల్లో మార్పులు రావని దేబ్ నాథ్ భావించాడు. 12 తరగతి పూర్తి చేసిన తరువాత చదువును విడిచిపెట్టి తల్లి వద్ద రూ.100 తీసుకొని ఢిల్లీకి వెళ్లిపోయాడు. అక్కడ క్యాటరింగ్ పనిచేస్తూ తన ఖర్చుల మేర సంపాదించుకున్నాడు. అలానే ఓ హోటల్ పాత్రలు శుభ్రం చేయడం, టేబుల్స్ తుడవడం లాంటి పనులన్నీ కూడా దేబ్ నాథ్ చేశాడు. అలా ఎంతో నిజాయితీగా పని చేసి అభిమానాన్ని పొందాడు. ఇదే సమయంలో దేబ్ నాథ్ రూ.500 జీతం ఇస్తుండగా..దాని రూ.3వేలకు పెచ్చాడు ఆయన యాజమాని. అలా కొన్నాళ్ల పాటు రోజుకు 18 గంటలు పనిచేసి..తాను సంపాదించిన డబ్బులను కుటుంబానికి పంపించేవాడు.

అలా కష్టపడుతూ.. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో సూపర్‌వైజర్‌ స్థాయికి ఎదిగాడు. అదే సమయంలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేయాలని భావించాడు. తాను ఉద్యోగం చేస్తూనే హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కోర్సును పూర్తి చేశాడు.  ఈవెంట్ లో పనులు చేస్తూనే అందరితో పరిచయాలు బాగా పెంచుకున్నాడు. సొంతంగా క్యాటరింగ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. క్యాటరర్స్ అండ్ డెకరేటర్స్ అనే కంపెనీని దేబ్‌నాథ్ ఏర్పాటు చేశాడు. ఎంతో కష్టపడి పని చేయడంతో కంపెనీ పెద్ద విజయాన్ని సాధించింది. అంతేకాక మంచి లాభాలను కూడా తెచ్చి పెట్టింది.

మలయ్ దేబ్ నాథ్ కి చెందిన కంపెనీ ఢిల్లీ, పూణే, జైపూర్, అజ్మీర్, గ్వాలియర్‌ సహా 35 కంటే ఎక్కువ ఆర్మీ మెస్  నిర్వహణ చూస్తోంది. 100 రూపాయలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయనకు నేడు ఉత్తర బెంగాల్‌లోని టీ తోటలతో సహా సుమారు రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన ధనవంతుడిగా ఎదిగేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాడు. అచంచలమైన కృషితోపాటు పట్టుదలతో పని చేసి విజేతగా నిలిచాడు. మలయ్ దేబ్ నాథ్ జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి