iDreamPost

Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల సంచలనం నిర్ణయం.

  • Published May 08, 2024 | 2:08 PMUpdated May 08, 2024 | 2:08 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఐటీ ఉద్యోగ సంస్థలు, ఉద్యోగులు ఎక్కువగా పెరుగుతున్నారు. ఐటీ ఉద్యోగులకు సంబందించిన వార్తలను కూడా ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాము. ఈ క్రమంలో హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ అదేంటో చూసేద్దాం.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఐటీ ఉద్యోగ సంస్థలు, ఉద్యోగులు ఎక్కువగా పెరుగుతున్నారు. ఐటీ ఉద్యోగులకు సంబందించిన వార్తలను కూడా ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాము. ఈ క్రమంలో హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ అదేంటో చూసేద్దాం.

  • Published May 08, 2024 | 2:08 PMUpdated May 08, 2024 | 2:08 PM
Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల సంచలనం నిర్ణయం.

హైదరాబాద్, బెంగళూరు నగరాలూ ఐటీ సంస్థలకు పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు.. తమ ఆఫీసు కార్యకలాపాలను కొనసాగించేందుకు ఎక్కువగా హైదరాబాద్, బెంగుళూరు మహా నగరాలనే ఎంచుకుంటూ ఉంటారు. అయితే, గతంలో బెంగుళూరుకు ఐటీ సంస్థలకు బాగా ప్రసిద్ధి చెందినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం.. హైదరాబాద్ కూడా ఐటీ సంస్థల రేస్ లో పరుగులు పెడుతూనే ఉంది. ఇప్పుడు అందరి చూపు ముందుగా హైదరాబాద్ మీదే పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు విదేశీ టెక్ కంపెనీలు ఇండియాలో తమ కార్యకలాపాలను వేగ వంతంగా కొనసాగుతున్నాయి. దీనితో రోజు రోజుకు పెరుగుతున్న కార్యకలాపాల వలన.. డేటా సెంటర్ల అవసరం పెరిగిపోతుంది. దీనితో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంతా కూడా తమ డేటా సెంటర్స్ ను విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఓ నిర్ణయాన్ని ప్రకటించారు. దానికి సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ ఐటీ పాలసీ ప్రకారం.. దేశంలోని ప్రజల డేటా అంతా కూడా ఇక్కడి సర్వేర్లలోనే నిక్షిప్తం చేయాల్సి ఉంది. కాబట్టి డేటా సెంటర్ల నిర్మాణం శెరవేగంగా కొనసాగుతుంది. దీనితో మైక్రోసాఫ్ట్ సంస్థ సైతం తెలంగాణాలో తమ సొంత డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అందుకు గాని సత్య నాదెళ్ల రన్ చేస్తున్న కంపెనీ.. హైదరాబాద్ లో దాదాపు రూ.267 కోట్ల విలువైన 48 ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. రంగారెడ్డి ల్యాండ్ హోల్‌సేల్ వ్యాపారి సాయి బాలాజీ డెవలపర్స్ నుంచి.. ఈ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. డేటా సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్న ప్రాంతం హైదరాబాద్ నగరానికి.. సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.

అయితే హైదరాబాద్ డేటా సెంటర్ ను మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్.. నెట్ వర్క్ కు అనుసంధానం చేస్తారు . ఇది ముంబై, చెన్నై, పూణే ప్రాంతాల్లో గత ఐదేళ్లుగా పని చేస్తూనే ఉంది. ముఖ్యంగా కేవలం డేటా సెంటర్ వ్యాపారం కోసం మాత్రమే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో మరొక రెండు ఫ్లాట్స్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు దేశంలో ఎక్కువగా డిజిటల్ రెవల్యూషన్ కారణంగా.. ప్రజలు ఎక్కువగా డేటాను వినియోగిస్తున్న కారణంగా.. క్లౌడ్ సేవలకు వినియోగం ఎక్కువగా పెరిగింది. దీనితో.. అదానీ, రిలయన్స్ వంటి భారతీయ వ్యాపార సంస్థలు వీటిపై పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. కాబట్టి ప్రస్తుతం ఇండియా లో డేటా సెంటర్ల వ్యాపారం శెరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మరి హైదరాబాద్ లో అతి పెద్ద డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి