iDreamPost

విశాఖవాసి కాబోతున్న చిరంజీవి – మెగాస్టార్ ఆకాంక్ష

అశేష జన సందోహం మధ్య ప్రభుత్వం పోలీసులు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా జరిపించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.

అశేష జన సందోహం మధ్య ప్రభుత్వం పోలీసులు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా జరిపించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.

విశాఖవాసి కాబోతున్న చిరంజీవి – మెగాస్టార్ ఆకాంక్ష

నిన్న విశాఖపట్నం వేదికగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అశేష జన సందోహం మధ్య ప్రభుత్వం పోలీసులు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా జరిపించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి రవితేజలతో పాటు టీమ్ సభ్యులందరూ హాజరయ్యారు. అనారోగ్యం వల్ల శృతి హాసన్ రాలేకపోవడానికి గల కారణాలను మెగాస్టార్ స్టేజిపై వివరించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ నెల 13న విడుదల కానుంది

వైజాగ్ విశిష్టత గురించి ప్రత్యేకంగా తన ప్రసగంలో వివరించిన చిరు ఇక్కడే సెటిలవ్వాలన్న ఆకాంక్షను వెలిబుచ్చడంతో పాటు పరిశ్రమకు సిఎం జగన్ అందిస్తున్న మద్దతు గురించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం వీక్షకులను ఆకట్టుకుంది. భీమిలి రోడ్డులో సైట్ కొన్నాని భవిష్యత్తులో ఇక్కడికి వచ్చే ప్రణాళికను మరోసారి సుస్పష్టంగా చెప్పిన చిరంజీవి అంతర్జాతీయ నగరంగా విశాఖపట్నంగా రూపు దిద్దుకుంటున్న తీరు గురించి చెప్పడం ఏపి రాజధాని ముఖచిత్రాన్ని జరుగుతున్న అభివృద్ధిని టాలీవుడ్ కోణంలో చెప్పిన తీరు ఆకట్టుకుంది. ప్రశాంత జీవనం కావాలనుకునే తనలాంటి వాళ్లకు స్వర్గధామంగా అభివర్ణించారు.

కాస్మోపాలిటన్ కల్చర్ ని చక్కగా పాటించే ఈ నగరంలో ఇల్లు కట్టే పనిని త్వరలోనే మొదలుపెడతానని చెప్పారు. విశాఖతో చిరంజీవికున్న అనుబంధం దశాబ్దాల నాటిది. ఎన్నో షూటింగులు వేడుకలు ఇక్కడ జరిగాయి వాల్తేరు వీరయ్య కంప్లీట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ని, ఎక్కడా బోర్ కొట్టించే విధంగా సినిమా ఉండదని, కథ చెప్పినప్పుడు ఏదైతే నమ్మకాన్ని దర్శకుడు బాబీ కలిగించాడో అంతకు రెట్టింపు ఫైనల్ అవుట్ ఫుట్ లో కనిపించిందని, బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పడం అభిమానులను కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దశాబ్దాల తరబడి హైదరాబాద్ జీవనానికి అలవాటు పడిన మెగాస్టార్ త్వరలో విశాఖవాసి కావడం కన్నా ఆనందం ఫ్యాన్స్ కి ఇంకేముంటుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి